Share News

Viral Video: ర్యాపిడో బుక్ చేసుకున్న యువతి.. సీక్రెట్‌గా వీడియో తీసి..

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:53 PM

Viral Video: ఆ ర్యాపిడో బైక్ రైడర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ర్యాపిడో బైక్ రైడర్ బైకుపై కూర్చున్న దృశ్యాలు ఉన్నాయి.

Viral Video: ర్యాపిడో బుక్ చేసుకున్న యువతి.. సీక్రెట్‌గా వీడియో తీసి..
Viral Video

ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న ఓ యువతికి ఊహించని షాక్ తగిలింది. ర్యాపిడో రైడర్‌ను చూసి ఆమె అవాక్ అయింది. దెబ్బకు రైడ్ క్యాన్సిల్ చేసింది. ఆ ర్యాపిడో బైక్ రైడర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ర్యాపిడో బైక్ రైడర్ బైకుపై కూర్చున్న దృశ్యాలు ఉన్నాయి. అతడు యువతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ యువతి మాత్రం అక్కడకు వెళ్లలేదు. వీడియో తీస్తూ ఉంది.


వీడియోలో యువతి మాట్లాడుతూ..‘ర్యాపిడో అతను పిలిచాడు. ర్యాపిడో అతను నా కోసం చూస్తూ ఉన్నాడు. నేను దాక్కొని వీడియో తీస్తూ ఉన్నాను. మీరు ఏమీ అనుకోనంటే ఓ మాట. నేను ఎక్కడ కూర్చోవాలి. ఎవరైనా నాకు చెప్పండి’ అని అంది. అతడి పర్మీషన్ లేకుండానే వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ వ్యక్తిని అలా అవమానించటం పద్దతి కాదు’..‘ఆ వ్యక్తి పర్మీషన్ లేకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో ఎలా పెడతావు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కోతిని కాపాడ్డానికి యువకుల సాహసం.. ప్రాణాలకు తెగించి..

దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Updated Date - Aug 05 , 2025 | 04:22 PM