Men Brave Rushing: కోతిని కాపాడ్డానికి యువకుల సాహసం.. ప్రాణాలకు తెగించి..
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:32 PM
Men Brave Rushing:ఆ నది సాధారణంగా లేదు. మొత్తం రాళ్లతో నిండిపోయి ఉంది. నీటిలో మునిగి ఉన్న రాళ్లు మొత్తం పాచిపట్టిపోయి ఉన్నాయి. పాచి పట్టిన రాళ్లపై కాలు పెడితే జారి కిందపడ్డం ఖాయం. కిందపడ్డపుడు తల రాళ్లకు తగిలితే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది.
ఓ ఇద్దరు యువకులు తమ ప్రాణాలకు తెగించి నీటిలో పడ్డ కోతిని కాపాడారు. ఎంతో రిస్క్ చేసి మరీ దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ సంఘటన జమ్మూకాశ్మీర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఓ కోతి నది మధ్యలో ఎటూ వెళ్లలేక ఇరుక్కుపోయింది. నీటిని దాటుకుని ఒడ్డుకు రావటం దానికి కష్టంగా మారింది. నీటిలోనే ఉండిపోయింది. అటు వైపు వెళుతున్న ఇద్దరు యువకులు నీటి మధ్యలో ఉన్న కోతిని గమనించారు. దాన్ని చూసి చలించిపోయారు.
సాయం చేయడానికి పూనుకున్నారు. ఆ నది సాధారణంగా లేదు. మొత్తం రాళ్లతో నిండిపోయి ఉంది. నీటిలో మునిగి ఉన్న రాళ్లు మొత్తం పాచిపట్టిపోయి ఉన్నాయి. పాచి పట్టిన రాళ్లపై కాలు పెడితే జారి కిందపడ్డం ఖాయం. కిందపడ్డపుడు తల రాళ్లకు తగిలితే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. అయినా కూడా ఆ యువకులు వెనక్కు తగ్గలేదు. నదిలోకి దిగారు. ఓ యువకుడు కోతి దగ్గరకు వెళ్లాడు. అది అతడ్ని చూడగానే భయపడిపోయింది. అక్కడినుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది.
ఆ యువకుడు దాన్ని పట్టుకున్నాడు. అది భయంతో కరవడానికి ప్రయత్నించింది. అతడు ‘నేను నీకు సాయం చేయడానికి వచ్చా’ అని దానితో చెప్పాడు. ఆ వెంటనే దాన్ని పట్టుకుని పైకి లేపాడు. పాపం అతడి కాలు జారింది. కోతి నీటిలో పడిపోయింది. ఆ యువకుడు నిలదొక్కుకుని మళ్లీ కోతిని పట్టుకున్నాడు. అతి కష్టం మీద దాన్ని ఒడ్డుకు చేర్చాడు. ఈ ప్రయత్నంలో రెండు, మూడు సార్లు అతడు కిందపడబోయాడు. అయినా సరే కోతికి ఏమీ కాకుండా బయటకు తీసుకువచ్చాడు.
ఇవి కూడా చదవండి
శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం.. నవ వధువు ఆత్మహత్య..
యస్ బ్యాంక్ లోన్ మోసం కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ