Newly Married Woman: ఘోరం.. శోభనం రాత్రే నవ వధువు.. బాబోయ్..
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:52 PM
Newly Married Woman: నవ దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఏమైందో ఏమో తెలీదు కానీ, హర్హిత దారుణమైన నిర్ణయం తీసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు ప్రాణాలు తీసుకుంది. పెళ్లైన మరుసటి రోజే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. సోమందేపల్లి మండలానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి భార్యాభర్తలు. ఈ దంపతుల ఏకైక కుమార్తె హర్హితకు కర్ణాటకలోని దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం నాడు అత్యంత ఘనంగా పెళ్లి జరిగింది.
నవ దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. వరుడు నాగేంద్ర స్టీట్లు తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఇంట్లో అంతా పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. అయితే.. ఏమైందో ఏమో తెలీదు కానీ, హర్హిత దారుణ నిర్ణయం తీసుకుంది. గదిలోకి వెళ్లి ఇంటి పైకప్పునకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఎంతసేపటికీ యువతి గది నుంచి బయటకు రాకపోవటంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టారు. లోపల ఉరికి వేలాడుతున్న హర్హితను చూసి అంతా షాక్ అయ్యారు. వెంటనే ఆమెను ఉరి నుంచి దించి ఆస్పత్రికి తరలించారు.
హర్హితను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు తేల్చారు. అయితే, యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. హర్హిత కుటుంబసభ్యులు మాత్రం ఆమె స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితుల బెదిరింపుల కారణంగానే హర్హిత ప్రాణాలు తీసుకుందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. స్నేహితులు పెళ్లికి వచ్చి వెళ్లిన అరగంటకే హర్హిత ప్రాణాలు తీసుకుందని అంటున్నారు. ఇక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకుంటే ఇలాగే ఉంటుంది.. అతడి పరిస్థితి ఏమైందో చూడండి..
స్టీల్ పాత్రల్లో ఈ ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్నారా? జాగ్రత్త..