MLA: ఏం డౌట్ వద్దు.. అక్రమార్కులు తప్పించుకోలేరు
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:43 PM
అక్రమార్కులెవరూ తప్పించుకోలేరని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణంలో 2008లో మంజూరై 2009లో అప్పటి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హయాంలో రూ. 44కోట్లతో ప్రారంభమై నేటికి అసంపూర్తిగా ఉన్న యూజీడీ(అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ)లో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామన్నారు.
- ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి
ఎమ్మిగనూరు(కర్నూలు): అక్రమార్కులెవరూ తప్పించుకోలేరని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి(MLA Jayanageshwar Reddy) అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణంలో 2008లో మంజూరై 2009లో అప్పటి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హయాంలో రూ. 44కోట్లతో ప్రారంభమై నేటికి అసంపూర్తిగా ఉన్న యూజీడీ(అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ)లో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిపై విచారణకు వైసీపీ నాయకులే పరోక్షంగా కోరుతున్నారన్నారు.
వైసీపీకి చెందిన నాయకులు పట్టణంలో యుజీడీ పూర్తి చేశామని, ఇందులో అవినీతి అక్రమాలు జరిగాయని, ప్రజాప్రతినిధి మేల్కోవాలని, విచారణచేయాలని ఓ వీడియోలో చెప్పారన్నారు. వారు కోరిన విధంగా త్వరలో విచారణ చేయిస్తామన్నారు. 2014లో తాను ఎమ్మెల్యేగా వచ్చిననాటికి 75శాతం పూర్తి అయిందని రూ. 44 కోట్లలో రూ. 36.60 కోట్లు ఖర్చు చేసినట్లు నిధులు మంజూరు చేశారన్నారు. నిధులు ఖర్చు అయినా పనులు మాత్రం పూర్తికాలేదన్నారు. పనులు ఎందుకు అసంపూర్తిగా ఉన్నాయోనని పరిశీలించి కాంట్రాక్టర్‌తో మట్లాడి 2019నాటికి 95శాతం పనులు పూర్తిచేసినట్లు తెలిపారు.
ఆ తరువాత ఎమ్మెల్యేగా వచ్చిన చెన్నకేవరెడ్డి ఎమ్మిగనూరు పర్యటనకు వచ్చిన అప్పటి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి యూజీడీ పూర్తి చేసేందుకు రూ. 26కోట్లు ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారన్నారు. మరి పథకం పూర్తి అయివుంటే ఎందుకు నిధులు ఇవ్వాలని కోరారో వైసీపీ నాయకులు చెప్పాలన్నారు. వాస్తవంగా రూ.16 కోట్లు అవసరమని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయన్నారు. తన తండ్రి బీవీ మోహాన్ రెడ్డి కల కర్నూలు, మంత్రాలయం రైల్వేలైన్‌కు కేంద్రం చేత డీపీఆర్ ఆమోదింపజేశానన్నారు. అలాగే ఎమ్మిగనూరు పట్టణానికి రూ.

200కోట్లతో బైపాస్ రోడ్డు కూడా మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరానన్నారు. ఇది త్వరలో వస్తుందని, ఆదోని, కోడుమూడు రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాలని కోరానన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అవి త్వరలో మంజూరు కానున్నాయన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లయ్య, నాయకులు మాజీ సర్పంచ్ కాశీం వలి, తిమ్మారెడ్డి, రామాంజనేయులు, తిరుపతయ్య నాయుడు, ముల్లా కలీముల్లా, రంగస్వామి గౌడ్, కౌన్సిలర్ రామదాసు గౌడ్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!
బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి
Read Latest Telangana News and National News