PM Modi Pratibha Setu: ‘ప్రతిభా సేతు’ ద్వారా కొత్త అవకాశాలు.. మన్ కీ బాత్‌లో మోదీ ప్రకటన..
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:20 PM
యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. మెరిట్ జాబితాలో అవకాశం పొందలేకపోయిన ప్రతిభావంతులకు ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ఆశాకిరణంలాంటిదని 'మన్ కీ బాత్' 125వ ఎడిషన్‌లో ప్రస్తావించారు.
125వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూపీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశిస్తూ ఒక కీలక ప్రకటన చేశారు. మెరిట్ జాబితాలో అవకాశం పొందలేకపోయిన ప్రతిభావంతుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వేలాదిమంది సివిల్స్ ఆశావహ అభ్యర్థుల ప్రతిభకు ఇదొక వారధి లాంటిదని ప్రశంసించారు. UPSCలో ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ క్లియర్ చేసినప్పటికీ తుది జాబితాలో అవకాశం చేజార్చుకున్న వారికి రెండవ ఛాన్స్ ఇచ్చేందుకు ఈ టాలెంటెడ్ పోర్టల్ ఉపకరిస్తుందని.. సివిల్స్ అభ్యర్థులకు ఇదొక ఆశాకిరణమని ఆయన అభివర్ణించారు.
దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన సివిల్ సర్వీసెస్ పరీక్షను యూపీఎస్సీ (UPSC) నిర్వహిస్తుంది. ఎంత ప్రతిభాపాటవాలు ఉన్నప్పటికీ పరిమిత అవకాశాల కారణంగా ఏటా వేలాది మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు సాధించలేకపోతున్నారు. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విలువైన సమయం, శ్రమ, డబ్బు వెచ్చిస్తారు. ఏళ్ల తరబడి కఠినంగా శ్రమించి విజయపుటంచులకు చేరినప్పటికీ చివరి క్షణాల్లో ఎందరో ప్రతిభావంతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. అదే ‘ప్రతిభా సేతు’.
'మన్ కీ బాత్' 125వ ఎడిషన్‌లో ప ప్రతిభా సేతు గురించి ప్రస్తావించారు. ఇందులో’ యూపీఎస్సీలో వివిధ పరీక్షల్లో అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల డేటాను సేవ్ చేస్తుంది. అర్హత గల అభ్యర్థుల వివరాలను ప్రతిభా సేతు పోర్టల్‌లో నమోదు చేస్తారు. తుది మెరిట్ జాబితాలో చోటు సంపాదించలేని వారి వివరాలను ప్రైవేట్ కంపెనీలకు అందుబాటులో ఉంచుతుంది. ఈ పోర్టల్ లోని సమాచారం ఆధారంగా కార్పొరేట్ కంపెనీలు భారీ జీతాలు ఇచ్చి సివిల్స్ అభ్యర్థులకు కొలువు ఆఫర్ చేస్తాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇది అవకాశాల వేదిక అని ఆయన అభివర్ణించారు. ఇది కేవలం ఉద్యోగం కోల్పోయిన వారికి మాత్రమేకాకుండా.. తమ టాలెంట్‌కి తగిన ఉద్యోగం కావాలని ఆశించే వారికి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాబోయ్ ఫీవర్.. చెన్నైలో పెరుగుతున్న జ్వరాల వ్యాప్తి
బలమైన అన్నాడీఎంకేను కోరుకుంటున్నారు..
For More National News And Telugu News