KTR On Assembly: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోంది..
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:12 PM
బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని కేటీఆర్ తెలిపారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామన్నారు. బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలని ఆయన సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు.
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే బీసీ బిల్లుతో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులు లేవని ఆరోపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉన్నామని గుర్తు చేశారు. ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని కేసీఆర్ గతంలో సూచించారని తెలిపారు. బీసీలను తమ పార్టీ స్పీకర్‌గా, కౌన్సిల్ చైర్మన్‌గా చేసిందని పేర్కొన్నారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారని చెప్పారు. 50 శాతం సీలింగ్ తీసేలా రాజ్యాంగ సవరణ చేయాలని స్పష్టం చేశారు.
బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని కేటీఆర్ తెలిపారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామన్నారు. బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలని ఆయన సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై నాలుగు సార్లు సీఎం మాట మార్చారని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని పార్లమెంట్‌లో ఎందుకు లేవనెత్తడం లేదని ప్రశ్నించారు. కులగణన శాస్త్రీయంగా చేయాలని చెప్పామని పేర్కొన్నారు. తాము చేసిన ఇంటింటి సర్వేలో బలహీనవర్గాల సంఖ్య 52శాతం ఉంటే.. మీ సర్వేలో 6 శాతం ఎలా తగ్గిందని నిలదీశారు. తమ కుటుంబం పాల్గొనకపోతే 6 శాతం తగ్గుతుందా..? అని ధ్వజమెత్తారు. డిక్లరేషన్ కాదు.. కావాల్సింది డెడికేషన్ అని కేటీఆర్ చురకలు పెట్టారు.
ఇవి కూడా చదవండి
హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..
జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..