Pawan Singh Incident: హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..
ABN , Publish Date - Aug 30 , 2025 | 07:40 PM
భోజ్‌పురి హీరో పవన్ సింగ్ హీరోయిన్ అంజలి రాఘవన్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. ఓ సినిమా స్టేజిపై ఆమె నడుము పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. పవన్‌తో పాటు అంజలిపై కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి.
ఓ సినిమా ఈవెంట్‌లో భోజ్‌పురి హీరో పవన్ సింగ్ హీరోయిన్ అంజలి రాఘవ్ నడుము పట్టుకున్నారు. స్టేజిపై ఆమె మైకులో మాట్లాడుతూ ఉండగా పవన్ సింగ్ ఆమె నడుమును అసభ్యంగా తాకారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు అంజలిపై కూడా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ట్రోలింగ్స్ తారాస్థాయికి చేరటంతో అంజలి స్పందించారు.
ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు వీడియోలు పోస్ట్ చేశారు. ఆ వీడియోల్లో.. ‘షూటింగ్ అంతా బాగానే జరిగింది. ఎలాంటి సమస్యా రాలేదు. లక్నోలో జరిగిన ఈవెంట్‌లో నేను స్టేజిపై ఉన్నాను. మైకు తీసుకుని జనంతో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు పవన్ సింగ్ ‘ఇక్కడ ఏదో అంటుకుని ఉంది’ అని అన్నారు. నేను ట్యాగ్ అయి ఉంటుందని అనుకున్నాను. కానీ, అతడు మాత్రం ఏదో ఉందంటూ నన్ను అసభ్యంగా తాకాడు. ఆ ఈవెంట్ జరిగింది పవన్ సింగ్ సిటీలో.
అక్కడ అతడ్ని దేవుడిలా కొలుస్తారు. నేను అతడికి వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను ఎవరైనా సపోర్టు చేసేవారా? ఆ వీడియో వైరల్ అయింది. నా మీద చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. అందులో నా తప్పేమీ లేదు. నేను ఈవెంట్ ఆర్గనైజర్లకు ఫోన్ చేశాను. వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. నాకు పవన్ సింగ్ పీఆర్ టీమ్‌నుంచి కాల్ వచ్చింది. ఈ ఘటనపై ఎలాంటి పోస్టు పెట్టొద్దని వాళ్లు నాకు వార్నింగ్ ఇచ్చారు. పోస్టు పెడితే కఠిన చర్యలు ఉంటాయని బెదిరించారు. అనుమతి లేకుండా ఆడవాళ్లను టచ్ చేయటం తప్పు. ఇదే గనుక హర్యానాలో జరిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. నేను ఇకపై భోజ్‌పురి సినిమాల్లో పని చేయను’ అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..
షూటింగ్ జరుగుతుండగా రెచ్చిపోయిన వీధి రౌడీలు.. మూవీ టీమ్‌పై దాడి..