Share News

Assault On Movie Team: షూటింగ్ జరుగుతుండగా రెచ్చిపోయిన వీధి రౌడీలు.. మూవీ టీమ్‌పై దాడి..

ABN , Publish Date - Aug 30 , 2025 | 05:44 PM

హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్ సారా అలీఖాన్‌ల కళ్ల ముందే టీమ్ సభ్యుల్లో కొంతమందిని విచక్షణా రహితంగా కొట్టారు. 27వ తేదీన ఈ దాడి జరగ్గా.. సినిమా లైన్ ప్రొడ్యూసర్ సౌరభ్ తివారీ 28వ తేదీన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Assault On Movie Team: షూటింగ్ జరుగుతుండగా రెచ్చిపోయిన వీధి రౌడీలు.. మూవీ టీమ్‌పై దాడి..
Assault On Movie Team

బాలీవుడ్ సినిమా ‘పతీ పత్నీ ఔర్ ఓ 2’ షూటింగ్ సందర్భంగా దారుణం చోటుచేసుకుంది. సినిమా టీమ్‌పై కొంతమంది రౌడీలు దాడి చేశారు. హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్ సారా అలీఖాన్‌ల కళ్ల ముందే టీమ్ సభ్యుల్లో కొంతమందిని విచక్షణా రహితంగా కొట్టారు. 27వ తేదీన ఈ దాడి జరగ్గా.. సినిమా లైన్ ప్రొడ్యూసర్ సౌరభ్ తివారీ 28వ తేదీన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు మెరాజ్ అలీని అదుపులోకి తీసుకున్నారు.


ఇక, ఈ సంఘటనపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ‘గురువారం ఉత్తర ప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని తోర్నిహిల్ రోడ్డులో ‘పతీ పత్నీ ఔర్ ఓ 2’ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ సమయంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పట్ట పగలు కొంతమంది స్థానిక గూండాలు సినిమా టీమ్ సభ్యులపై దాడి చేశారు. సినిమా సెట్‌లో ఈ దాడి జరిగింది.


సినిమాలు నిర్మిస్తున్న వారికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భద్రత కల్పించటం లేదు. అలాంటప్పుడు నోయిడా ఫిల్మ్ సిటీని ప్రమోట్ చేయటం వల్ల లాభం ఏంటి? ప్రభుత్వం భద్రత కల్పించటంలో విఫలం అయితే, నిర్మాతలు, దర్శకులు, నటులు, టెక్నీషియన్లు తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి ఉత్తర ప్రదేశ్‌లో షూటింగ్ ఎలా చేస్తారు. ఈ దారుణ సంఘటన బాలీవుడ్ స్టార్లు ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్‌ల కళ్ల ముందే జరిగింది. ఈ దాడితో రాష్ట్రంలో సినిమా షూటింగులకు సరైన భద్రత లేదని తేటతెల్లం అయింది’ అని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

ఏనుగు తొండంలో బీరు పోసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే..

తండ్రి దారుణం.. కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని..

Updated Date - Aug 30 , 2025 | 06:05 PM