Darshan Demands Bedsheet: జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..
ABN , Publish Date - Aug 30 , 2025 | 06:30 PM
దర్శన్ పరప్పన జైలులో కొన్ని నెలల పాటు ఉన్నారు. ఆ సమయంలో వీఐపీ ట్రీట్‌మెంట్ అందింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీచేసింది.
అభిమాని రేణుకా స్వామి మర్డర్ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్, పవిత్ర గౌడల బెయిల్ రద్దయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరూ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. గతంలో కూడా దర్శన్ ఇదే జైలులో కొన్ని నెలల పాటు ఉన్నారు. ఆ సమయంలో వీఐపీ ట్రీట్‌మెంట్ అందింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు జారీచేసింది. దర్శన్‌ను సాధారణ ఖైదీలాగే చూడాలని స్పష్టం చేసింది.
దీంతో జైలు అధికారులు అందరికి ఇచ్చినట్లే ఆయనకు కూడా ఒక బెడ్‌షీట్ మాత్రమే ఇచ్చారు. ఆ ఒక్క బెడ్ సీట్‌తో దర్శన్ సరిగా నిద్రపోలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదనంగా మరో బెడ్ షీట్ ఇవ్వాలంటూ దర్శన్ తరపు న్యాయవాది సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా దర్శన్ తరపు న్యాయవాది సునీల్ కుమార్ విచారణ సందర్భంగా కోర్టులో మాట్లాడుతూ.. ‘దర్శన్‌కు ఇంటి భోజనం కావాలని మేము అడగటం లేదు.
ఫైవ్ స్టార్ సదుపాయాలు కావాలని కూడా అడగటం లేదు. మేము అడుగుతున్నది అదనంగా ఓ బెడ్‌షీట్, ఓ దిండు మాత్రమే. ఇందుకు కోర్టు పర్మిషన్ ఇస్తే చాలు’ అని అన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి. ఓ వైపు దర్శన్ బెడ్‌షీట్ కావాలంటుంటే.. మరో వైపు పవిత్ర గౌడ బెయిల్ కావాలంటోంది. పవిత్ర తరపు న్యాయవాది లోయర్ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన విచారణ సెప్టెంబర్ 2కు వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి
షూటింగ్ జరుగుతుండగా రెచ్చిపోయిన వీధి రౌడీలు.. మూవీ టీమ్‌పై దాడి..
ఏనుగు తొండంలో బీరు పోసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే..