Shashikala: జయలలిత నెచ్చెలి శశికళ ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:44 PM
ఐకమత్యంతో కూడిన బలమైన అన్నాడీఎంకేను ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్ల ప్రతి నేతా, కార్యకర్తా ఏకతాటిపైకి రావాలని ఆ పార్టీ బహష్కిృత నాయకురాలు శశికళ(Shashikala) పిలుపునిచ్చారు. ఇదే విషయంపై ఆమె శనివారం ప్రకటన విడుదల చేశారు.
బలమైన అన్నాడీఎంకేను కోరుకుంటున్నారు..
కలిసి నడుద్దాం రండి
ఈపీఎస్కు శశికళ పిలుపు
చెన్నై: ఐకమత్యంతో కూడిన బలమైన అన్నాడీఎంకేను ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్ల ప్రతి నేతా, కార్యకర్తా ఏకతాటిపైకి రావాలని ఆ పార్టీ బహష్కిృత నాయకురాలు శశికళ(Shashikala) పిలుపునిచ్చారు. ఇదే విషయంపై ఆమె శనివారం ప్రకటన విడుదల చేశారు. ఏ పార్టీ (డీఎంకే)ని అయితే అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనుకున్నారో, రాజకీయ క్షేత్రంలో లేకుండా చేయాలని ఎంజీఆర్, జయలలిత కోరుకున్నారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశామన్నారు. భవిష్యత్తులో ఈ తప్పు పునరావృత్తం కారాదన్నారు. అందుకే పార్టీ నేతలంతా ఏకం కావాలని ఎంతో కాలంగా పిలుపునిస్తున్నానని పేర్కొంటూ.. ఈ విషయంలో తనకు ఎలాంటి స్వార్థం లేదన్నారు.
ఎల్లవేళలా ప్రజాక్షేమాన్ని మాత్రమే ఆకాంక్షిస్తుంటాన న్నారు. తన కుటుంబం పార్టీనే అని, తనను ఎవ్వరూ ఒక సర్కిల్‌లో బంధించలేరన్నారు. పార్టీకి చెందిన నేతలపై తనకు ఎలాంటి కోపతాపాలు లేవన్నారు. ఇంతకంటే కఠిన పరీక్షలను తన బాల్యంలోనే ఎదుర్కొని వచ్చినట్టు వెల్లడించారు. తాను ఇద్దరు గొప్ప వ్యక్తుల వద్ద శిక్షణ పొందానని, ఇది తనను ఎంతగానో పరిణితి చెందేలా చేసిందన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ విధి విధానాలు, అణిగిమణిగి ఉండే లక్షణాలు తనను ఎంతో పాఠాలు నేర్పించిందన్నారు. అందరిలో ఒకరిగా, సోదరిగా కలిసిపోయి పార్టీ కోసమే తాను పని చేసేందుకు ఇష్టపడుతానన్నారు.

పార్టీ, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఇప్పటివరకు తన కార్యాచరణ ఉన్నదని వెల్లడించారు. 2021లో కూడా పార్టీ విజయం సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే, అన్నాడీఎంకే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భావించే ఎన్నికల్లో పోటీ నుంచి దూరంగా ఉన్నానని తెలిపారు. కానీ, ఆ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించకపోగా, ఇప్పటివరకు జరిగిన ఏ ఒక్క ఎన్నికల్లో పార్టీ ఒక్క గెలుపును కూడా సొంతం చేసుకోలేకపోవడం తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. ఈ పరిస్థితులను చూస్తూ మిన్నకుండిపోవడం అనేది మన నేతలకు మనం చేసే అతిపెద్ద ద్రోహంగా భావిస్తున్నట్టు తెలిపారు. ‘‘గతం గతః. ఈ పార్టీ కార్యకర్తలది. వారి నిర్ణయమే అంతిమ నిర్ణయం.
వారి నిర్ణయానికి కట్టుబడి మనమంతా ఐకమత్యంతో ముందుకు సాగుదాం’’ అని ఆమె పిలుపునిచ్చారు. అవకాశ రాజకీయవాదులకు మనం ఏమాత్రం చోటు ఇవ్వరాదన్నారు. ఒక చేత్తో కొడితే ఎలా శబ్ధం రాదో... అదే విధంగా ఒంటరిగా వెళ్లడం వల్ల ఎలాంటి విజయం చేకూరదన్నారు. అన్నాడీఎంకేలో ప్రస్తుత పరిణామాలను డీఎంకే అనుకూలంగా మలుచుకుని చలి కాచుకుంటోందన్నారు. శక్తిమంతమైన పార్టీని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, అలాగే, అనేక రాజకీయ పార్టీలు కూడా దీన్నే కోరుకుంటున్నాయన్నారు. వారందరి అభీష్టం మేరకు శక్తిమంతమైన అన్నాడీఎంకేను తయారు చేసి, ఐకమత్యంతో ముందుకు సాగుతూ అధికార డీఎంకేకు గుణపాఠం నేర్పుదామని శశికళ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోంది..
బలమైన అన్నాడీఎంకేను కోరుకుంటున్నారు..
Read Latest Telangana News and National News