Share News

US: న్యూయార్క్‌లో ఘనంగా ది వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే పరేడ్ వేడుకలు..

ABN , Publish Date - Aug 22 , 2025 | 03:10 PM

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ న్యూయార్క్‌లోని మాడిసన్ అవెన్యూలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. భారతీయ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా 43వ వార్షిక ఇండియా-డే పరేడ్‌ను కన్నులపండువగా నిర్వహించింది.

US: న్యూయార్క్‌లో ఘనంగా ది వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే పరేడ్ వేడుకలు..
India Day Parade 2025

India Day Parade 2025: న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా డే పరేడ్‌ వేడుకలను ఘనంగా నిర్వహించింది. మాడిసన్ అవెన్యూలో జరిగిన ది వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే కవాతులో లక్షలాది మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. 'సర్వేజనా సుఖినో భవంతు' థీమ్ తో సాగిన ఈ పరేడ్ లో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రాండ్-మార్షల్స్‌గా హాజరై అందరినీ అలరించారు.


భారతీయ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా 43వ వార్షిక ఇండియా-డే కవాతు సాగింది. ప్రముఖులు దేశభక్తి పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమానికి హాజరైన వారిలో దేశభక్తిని రేకెత్తించారు.'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' పాటలతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తమ దేశానికి భారతీయ-అమెరికన్ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రశంసిస్తూ.. నిర్వాహకులను అభినందించారు.


న్యూయార్క్ భారత కాన్సుల్ జనరల్ అంబ్. బినయా ఎస్. ప్రధాన్ మాట్లాడుతూ, ఇది భారతీయ ప్రవాసులకు నిజంగా చిరస్మరణీయమైన రోజని అన్నారు. పార్లమెంటు సభ్యుడు, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు సత్నామ్ సింగ్ సంధు ఈ కార్యక్రమానికి హాజరై భారతీయ-అమెరికన్ల సహకారాన్ని ప్రశంసించారు. మిచిగాన్ 13వ కాంగ్రెస్ జిల్లాకు అమెరికా ప్రతినిధి శ్రీ థానేదార్, మోంట్‌గోమెరీ టౌన్‌షిప్ మేయర్ నీనా సింగ్, న్యూయార్క్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఛాంబర్‌లోని ఆసియా అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల వ్యవహారాల డైరెక్టర్ సిబు నాయర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. FIA అధ్యక్షురాలు సౌరిన్ పారిఖ్ ఈ కవాతు మన సమాజం బలం, ఐక్యతను సూచిస్తుందన.. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డు

చైనాను ఎదుర్కోవాలంటే భారత్‌ లాంటి మిత్రుడు ఉండాలి: నిక్కీ హేలీ

మరిన్ని అంతర్జాతీయ వార్తలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 03:15 PM