Share News

BSNL: మీరు బీఎస్ఎన్‌ఎల్‌ వినియోగదారులా.. అయితే ఈ సమాచారం మీకోసమే..

ABN , Publish Date - Aug 22 , 2025 | 01:35 PM

బీఎస్ఎన్‌ఎల్‌ సంస్థ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. కేవలం రూ.400లకే సరికొత్త ట్రిపుల్‌ ప్లే (ఎఫ్‌టీటీహెచ్‌)ఫైబర్‌ టీవీ బేసిక్‌ప్లాన్‌ ప్రవేశపెట్టినట్లు అనంతపురం బిజినెస్‌ టెలికాం జనరల్‌ మేనేజరు షేక్‌ముజిబ్‌పాషా ఓప్రకటనలో తెలిపారు.

BSNL: మీరు బీఎస్ఎన్‌ఎల్‌ వినియోగదారులా.. అయితే ఈ సమాచారం మీకోసమే..

- బీఎస్ఎన్‌ఎల్‌ కొత్త ఆఫర్‌

- రూ.400లకే ట్రిపుల్‌ప్లే ఫైబర్‌టీవీ బేసిక్‌ప్లాన్‌

అనంతపురం: బీఎస్ఎన్‌ఎల్‌(BSNL) సంస్థ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. కేవలం రూ.400లకే సరికొత్త ట్రిపుల్‌ ప్లే (ఎఫ్‌టీటీహెచ్‌)ఫైబర్‌ టీవీ బేసిక్‌ప్లాన్‌ ప్రవేశపెట్టినట్లు అనంతపురం బిజినెస్‌ టెలికాం జనరల్‌ మేనేజరు షేక్‌ముజిబ్‌పాషా గురువారం ఓప్రకటనలో తెలిపారు. ఈప్లాన్‌ ద్వారా అపరిమిత ఇంటర్నెట్‌, 44తెలుగు పేచానల్స్‌తోపాటు 9ఓటీటీలు కూడా పొందడానికి అవకాశం ఉందన్నారు.


లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లు బీఎ్‌సఎన్‌ఎల్‌లో టిప్‌గా నమోదు చేసుకొని ఇప్పటికే ఉన్న ఏపీఎ్‌సఎఫ్‌ ఎల్‌ కస్టమర్లను బీఎ్‌సఎన్‌ఎల్‌కు మార్చడంతోపాటు కొత్త ఫైబర్‌ కనెక్షన్‌లను కూడా అందించవచ్చన్నారు. ఆసక్తిగల లోకల్‌కేబుల్‌ ఆపరేటర్లు అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, కదిరి, గుంతకల్లు,


ap-1.jpg

రాయదుర్గం(Kadiri, Guntakal, Rayadurgam) తాడిపత్రి పట్టణాలలో తమకు సమీపంలో ఉన్న బీఎ్‌సఎన్‌ఎల్‌ డివిజనల్‌ కార్యాలయం లేదా జిల్లాకేంద్రంలో ఉన్న పీజీఎం కార్యాలయంలో సంప్రదించి ఈకొత్త ప్లాన్‌ పొందవచ్చన్నారు. శుక్రవారం నుంచే టిప్‌ మేళాలు నిర్వహిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

శాంతిస్తున్న ఉగ్ర గోదావరి

ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 22 , 2025 | 01:50 PM