Jagga Reddy Vs KTR: ఆయనకు రాజకీయంగా మెచ్యురిటీ రాలేదు
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:29 PM
కేసీఆర్ కుటుంబం.. రాజకీయంగా వెలుగుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వివరించారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్నికేటీఆర్ అప్పుడే మర్చిపోయాడా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 22: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి మరోసారి మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. పదేళ్లు మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కి రాజకీయంగా మెచ్యూరిటీ రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష.. కాంగ్రెస్ పార్టీ చేసిన డిజైన్ అని అభివర్ణించారు. కేసీఆర్ జాక్‌పాట్ కొట్టాడు. కానీ మా వాళ్ళు కొట్ట లేక పోయారన్నారు. అన్నం లేకుండా కేసీఆర్ ఉండగలడా? అంటూ ఈ సందర్భంగా ఆయన సందేహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన కేటీఆర్ నోరు జారుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో కేటీఆర్ అమ్మమ్మ, తాతయ్య ఉండి ఉంటే.. అతడి చెంపపై కొట్టేవారన్నారు. కేసీఆర్ కుటుంబమంతా డ్రామా ఆర్టిస్టులని ఎద్దేవా చేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిజ్ఞానం కేటీఆర్‌కి ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి క్యారెక్టర్ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వక పోతే మీరెవరో ప్రజలకు కూడా తెలియక పోయేదని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయిందా? అంటూ కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. నీ కుటుంబమంతా.. సోనియా గాంధీ ఇంటికి వెళ్లినప్పుడు చిల్లర పార్టీ అనిపించ లేదా? అంటూ కేటీఆర్‌కు ఈ సందర్భంగా జగ్గారెడ్డి చురకలంటించారు.
కేసీఆర్ కుటుంబం.. రాజకీయంగా వెలుగుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆయన వివరించారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్నికేటీఆర్ అప్పుడే మర్చిపోయాడా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ పాఠాలు నేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచే కదా అని ఆయన వివరించారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అయితే మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాస్ అయినట్టేనంటూ కేటీఆర్ తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రను కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలంటూ కేటీఆర్‌కు ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తారా? అవకాశవాద రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ వైఖరులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎండగట్టారు.
ఇవి కూడా చదవండి
వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు
పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
Read Latest Telangana News and National News