Share News

చైనాను ఎదుర్కోవాలంటే భారత్‌ లాంటి మిత్రుడు ఉండాలి: నిక్కీ హేలీ

ABN , Publish Date - Aug 22 , 2025 | 07:00 AM

చైనాను ఎదుర్కోవాలంటే అమెరికాకు భారత్‌ వంటి ఒక మిత్రుడు తప్పనిసరిగా ఉండాలని అమెరికా మాజీ దౌత్యవేత్త నిక్కీ హేలీ స్పష్టం చేశారు.

చైనాను ఎదుర్కోవాలంటే భారత్‌ లాంటి మిత్రుడు ఉండాలి: నిక్కీ హేలీ

న్యూఢిల్లీ, ఆగస్టు 21: చైనాను ఎదుర్కోవాలంటే అమెరికాకు భారత్‌ వంటి ఒక మిత్రుడు తప్పనిసరిగా ఉండాలని అమెరికా మాజీ దౌత్యవేత్త నిక్కీ హేలీ స్పష్టం చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష రేసులో ట్రంప్‌పై పోటీ చేసిన ఆమె ఈ మేరకు తాజాగా రాసిన ఆర్టికల్‌ బుధవారం ఒక ఆంగ్ల మేగజైన్‌లో ప్రచురితమైంది. భారత్‌తో సంబంధాల విషయంలో తిరోగమన వైఖరిని వీడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆమె కోరారు. ఆసియాలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయగల ఏకైక దేశంతో వాణిజ్య వివాదాలు పెట్టుకోవడం వ్యూహాత్మక తప్పిదం అవుతుందని తేల్చిచెప్పారు. భారత్‌ చేస్తున్న చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిధులు సమకూరుస్తున్నాయనే ట్రంప్‌ వాదనను ఆమె సమర్థించారు. అయితే, భారత్‌ను విలువైన స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక భాగస్వామిగా మాత్రమే పరిగణించాలని, చైనాలాంటి శత్రువుగా భారత్‌ను పరిగణించకూడదని ఆమె సూచించారు.

Updated Date - Aug 22 , 2025 | 07:00 AM