Nimmala Ramanaidu Fires on YS JAGAN: జగన్ పాలనలో ఏపీకి తీరని నష్టం.. మంత్రి నిమ్మల ఫైర్
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:00 AM
జగన్ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేయగా, చంద్రబాబు మానవత్వంతో పునరుద్ధరించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నష్టం కన్నా, జగన్ ఐదేళ్ల పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏపీ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి, అప్పుల పాల్జేశాడని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) పాలకొల్లు నియోజకవర్గంలో 53 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. జగన్ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేయగా, చంద్రబాబు మానవత్వంతో పునరుద్ధరించారని ఉద్ఘాటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నష్టం కన్నా, జగన్ ఐదేళ్ల పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని నొక్కిచెప్పారు. తమ ప్రభుత్వంలో పెన్షన్ సొమ్ము పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ. 13 వేలు అందించామని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, గుంతలు లేని రోడ్లు, మత్స్యకారులకు రూ. 20 వేలు, తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. హై కోర్టుకు సిట్ అధికారులు.. ఎందుకంటే..
కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.. అసలు విషయమిదే..
Read Latest Andhra Pradesh News and National News