Share News

MP Kalisetty Appalanaidu: సీఎం చంద్రబాబుని చూసి జగన్ అండ్ కో బుద్ధి తెచ్చుకోవాలి: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:48 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలందరూ జగన్‌కి జ్ఞానోదయం చేయాలని హితవు పలికారు.

 MP Kalisetty Appalanaidu: సీఎం చంద్రబాబుని చూసి జగన్ అండ్ కో బుద్ధి తెచ్చుకోవాలి: ఎంపీ కలిశెట్టి
MP Kalisetty Appalanaidu

విజయనగరం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (MP Kalisetty Appalanaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(ఆదివారం) విజయనగరంలో ఎంపీ కలిశెట్టి, మంత్రి కొండపల్లి పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలందరూ జగన్‌కి జ్ఞానోదయం చేయాలని హితవు పలికారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.


సీఎం చంద్రబాబునాయుడుని చూసి జగన్ అండ్ కో బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. పరిశ్రమల స్థాపన కోసం చంద్రబాబు పాటుపడుతుంటే, పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌కు రావొద్దని జగన్ ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేస్తామంటే టీడీపీ నేతలు ఎప్పుడూ అడ్డుకోలేదని.. అయినా జగన్ ఏమీ చేయలేకపోయారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.


బొత్స సత్యనారాయణపై మంత్రి కొండపల్లి ఫైర్

మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ తన కుటుంబం ఎదుగుదలకే పాటుపడ్డారు తప్పా సొంత జిల్లాకు ఒరిగిందేమీ లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వైసీపీ హయాంలో తాను ఏం చేస్తున్నది కూడా చెప్పుకోలేని దీనస్థితిలో బొత్స సత్యనారాయణ కాలం గడిపారని ఆక్షేపించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడిపై వైసీపీ నేతలు నిందలు వేశారని మండిపడ్డారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.


ఈ ఆరోపణలపై తనపై విచారణ జరిపించాలని అయ్యన్నపాత్రుడు గవర్నర్‌ని కోరారని గుర్తుచేశారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి చేసిన అవినీతి, ఉత్తరాంధ్రాకు చేసిన అన్యాయంపై బొత్స సత్యనారాయణ విచారణ కోరగలరా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు

డాలర్‌ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం

For More AP News and Telugu News

Updated Date - Aug 10 , 2025 | 01:17 PM