Share News

AP NEWS: పవన్‌ను బంధించింది ఎవరు?

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:38 AM

వైసీపీ నేతల చేతిలో దారుణ హింసకు గురైన పవన్ కుమార్‌ను చిత్తూరులో బంధించింది ఎవరు? అతని వాయిస్ రికార్డు చేసి వీడియోలు విడుదల చేసిందెవరు? తిరుపతిలో దాడికి గురైన పవన్ చిత్తూరుకు ఎలా వెళ్లాడు? రౌడీ మూకలకు భయపడి తలదాచుకున్నాడా? లేకుంటే ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లి బంధిం చారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

AP NEWS: పవన్‌ను బంధించింది ఎవరు?
Pawan Kumar Case

» తిరుపతి నుంచి చిత్తూరుకు ఎలా వెళ్లాడు?

» వైసీపీ దాడి ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 9(ఆంద్రజ్యోతి): వైసీపీ నేతల చేతిలో (YSRCP Leaders) దారుణ హింసకు గురైన పవన్ కుమార్‌ను (Pawan Kumar) చిత్తూరులో బంధించింది ఎవరు? అతని వాయిస్ రికార్డు చేసి వీడియోలు విడుదల చేసిందెవరు? తిరుపతిలో దాడికి గురైన పవన్ చిత్తూరుకు ఎలా వెళ్లాడు? రౌడీ మూకలకు భయపడి తలదాచుకున్నాడా? లేకుంటే ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లి బంధిం చారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో తిరుపతికి చెందిన వైసీపీ కీలక నేతల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు.


గొడవకు కారణాలపై ఆరా

తిరుపతిలోని ఒక హోటల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న పవన్ కుమార్‌కు, వైసీపీ నేతలకు మధ్య గొడవకు గల కారణాలపైనా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కేవలం డబ్బు వ్యవహారమేనా లేదా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.


దర్యాప్తు వేగవంతం

ఈ ఘటనను ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా తీసుకోవడంతో జిల్లా పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది టీమ్‌లుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి, బైక్ రెంటల్ అధినేత జగదీశ్వరరెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుల అదుపులో ఉన్న మరో నిందితుడు దినేష్‌ను విచారిస్తున్నారు. మరికొందరు అనుమానితుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు

డాలర్‌ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం

For More AP News and Telugu News

Updated Date - Aug 10 , 2025 | 11:40 AM