Share News

Police Drones: డ్రోన్లతో నేరాల నియంత్రణ

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:07 AM

తిరుపతి జిల్లా పోలీసుల పొదిలోకి ఇటీవల అందిన ఒక సాంకేతిక ఆయుధం డ్రోన్ భిన్న అవసరాలకు ఉపయోగపడే వివిధ సామర్థ్యాలున్న 9 డ్రోన్లు ప్రభుత్వం తిరుపతికి కేటాయించింది. దేశ నలుమూ లల నుంచి వచ్చే జనంలో నేరస్థులు సులువుగా కలగలిసిపోయే అవకాశమున్న ప్రాంతం కావడంతో వీటి అవసరం మరీ ఎక్కువ. అలాగే తరచూ వీవీఐపీల పర్యటనలు, భారీ సభలు జరుగుతుండటంతో క్రౌడ్ కంట్రోల్‌కి కూడా డ్రోన్ల సాయం పోలీసులకు బాగా ఉపయోగపడుతోంది.

Police Drones: డ్రోన్లతో నేరాల నియంత్రణ
Police Drones

» తిరుపతి పోలీసులకు అందిన హై టెక్నాలజీ డ్రోన్లు

» ఆకాశ గూఢచారి

దట్టమైన అడవులుండే ప్రాంతం తలకోన ఎర్రచందనం నాటుసారా గుట్టుగా లాగించెయ్యవచ్చు. ఈ ప్రాంతంపై ఇటీవల పోలీసులు డ్రోన్‌లతో (Police Drones) నిఘా పెట్టారు. ఏప్రిల్ 273 ఎడారిపాలెం మండలం వేములవాడ సమీపంలో ఎగురుతున్న డ్రోన్‌కి అనుమానాస్పద సంకేతాలు అందాయి. వాటి ఆధారంగా కెమెరా జూమ్ చేశారు.తలకోన జలపాతం వాగు దగ్గరలోని ఒక చెట్టు తొర్రెలో నుంచి సిగ్నల్స్ అందుతున్నాయి. తీరా చూస్తే చెట్టు తొర్లలో 10 లీటర్ల నాటుసారా ఉంది ఈ సంఘటనలో ఇద్దరు నాటుసారా తయారీదారులను వెంటనే అదపులోకి తీసుకున్నారు.


తిరుపతి రూరల్ మండలంలో స్వర్ణముఖి నదీతీరం కంపచెట్లతో నిర్జనంగా ఉంటుంది. ఈ ప్రాంతంపై ఎగురుతున్న డ్రోన్ కెమెరా కంట్లో పొదల్లో ఏదో కదలిక పడింది. జూమ్ చేసి చూడగా కొంతమంది అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇంజక్షన్లు, మత్తు బిళ్లలు కనిపించాయి. వెంటనే బీటీ పోలీసులకు సమాచారం అందింది. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. శంకర్ నాయుడు కాలనీ సమీపంలో జూన్ 18న ఈ సంఘటన జరిగింది.

తిరుదానూరు సమీపంలోని పాడుపడ్డ భవనాల మీద డ్రోన్ నిఘా పెట్టారు. నలుగురు యువకులు గంజాయి సేవిస్తూ దొరికిపోయారు. ఎనిమిది ప్యాకెట్లు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.


కథనం- ఆంధ్రజ్యోతి, తిరుపతి(నేరవిభాగం): తిరుపతి జిల్లా పోలీసుల పొదిలోకి ఇటీవల అందిన ఒక సాంకేతిక ఆయుధం డ్రోన్ భిన్న అవసరాలకు ఉపయోగపడే వివిధ సామర్థ్యాలున్న 9 డ్రోన్లు ప్రభుత్వం తిరుపతికి కేటాయించింది. దేశ నలుమూ లల నుంచి వచ్చే జనంలో నేరస్థులు సులువుగా కలగలిసిపోయే అవకాశమున్న ప్రాంతం కావడంతో వీటి అవసరం మరీ ఎక్కువ. అలాగే తరచూ వీవీఐపీల పర్యటనలు, భారీ సభలు జరుగుతుండటంతో క్రౌడ్ కంట్రోల్‌కి కూడా డ్రోన్ల సాయం పోలీసులకు బాగా ఉపయోగపడుతోంది. నేరస్థుల గుండెల్లో దడపుట్టించే పనులను ఈ డ్రోన్‌లు చేస్తున్నాయి. జిల్లా పోలీసు విభాగానికి అందిన ఈ డ్రోన్‌లు.. వాటి విశేషాలు..


బాహుబలి.. టెథర్డ్ డ్రోన్

ఈ డ్రోన్ అత్యంత శక్తివంతమైంది. తిరుపతి వంటి భక్తజనం వచ్చిపోయే ప్రదేశంలో దీని అవసరం ఎక్కువ అని గుర్తించారు. దీని విలువ రూ.30 లక్షలు 100 నుంచి 140 మీటర్ల ఎత్తులోనే ఎగురుతూ అయిదు కిలోమీటర్ల దూరం వరకూ తిరుగుతూ పర్యవేక్షిస్తు౦ది. ఐదు కిలోల బరువున్న వస్తువులను కూడా దీనిద్వారా అత్యవసర సమయాల్లో చేరవేయవచ్చు. దాదాపు 8 గంటల పాటు నిరంతరాయంగా ఎగరగల సామర్థ్యం దీనికి ఉంటుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి వీవీఐపీల పర్యటనల సమయంలో పోలీసులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ డ్రోన్ దాదాపుగా 30 కిలోల బరువు ఉంటుంది.


మ్యాట్రిక్స్ 4టీ థర్మల్.. ఆకాశంలో నిఘా

దాదాపుగా కంటికి కనిపించనంత ఎత్తున ఎగురుతుంది. ఈ డ్రోన్ నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల ఎత్తు దాకా ఎగురగలదు. అతి తక్కువ శబ్దం చేస్తుంది. నైట్ విజన్ కెమెరాలు ఉన్నందున చిమ్మచీకటిలోనూ ఫొటోలు తీస్తుంది. 5 కిలోమీటర్ల రేడియస్‌లోని ఫొటోలు తీయగలదు. ఈ డ్రోన్‌లో 112 ఎక్స్ జూమింగ్ కెమెరా ఉన్నందున అంత ఎత్తు నుంచి కూడా క్లోజప్ ఫొటోలు తీయగలదు. ఈ డ్రోన్ ఒకరకంగా నింగిలో నుంచి నేలమీద నిఘాకు బాగా ఉపయోగపడుతుంది. ఏఐ టెక్నాలజీ ఉంది. రద్దీ ప్రాంతాల్లో ఎంత మంది.. ఉన్నారో కూడా లెక్కకట్టి చెప్పేస్తుంది. రహదారుల్లో ప్రయాణించే వాహనాల నంబర్లను కూడా జూమ్ చేసుకుని గుర్తించి నిక్షిప్తం చేసుకుంటుంది. గుద్దేసి ఎల్లిపోయే వాహనాలను ఇట్టే పట్టేస్తుంది. ఈ డ్రోన్‌లో స్పాట్ లైట్ స్పీకర్ కూడా అమరి ఉంటాయి. అత్యవసర సమయాల్లో ఈ స్పీకర్ ద్వారా ప్రజలను అప్రమత్వం చేసే వీలుంది. ప్రజల్ని హెచ్చరించడానికి అనువుగా సైరన్ కూడా ఉంటుంది. భారీ భవనాల్లో అగ్నిప్రమాదాలు, వరదలు వంటి సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది. ఈ డ్రోన్లు జిల్లాలో రెండు ఉన్నాయి.


ఏయిర్ ట్రీ ఎస్ - ఫిక్ కంట్రోలింగ్

ఈ డ్రోన్ దాదాపు ఒక కిలోమీటరు ఎత్తు వరకూ ఎగురుతుంది. కిలోమీటర్ల రేడియస్‌లో ఫొటోలు తీస్తుంది. ట్రాఫిక్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. రాంగ్ పార్కింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, అపోజిటట్‌ రూట్‌లో రావడం, త్రిబుల్ రైడింగ్ వంటివి గుర్తించి చలానాలు వేయడంలో పోలీసులకు బాగా సహకరిస్తుంది. జాతర్ల సమయంలో నింగిలోంచి నిఘా పెడుతుంది. అలాగే నగర శివారు ప్రాంతాల్లో పాడుబడ్డ భవనాల వద్ద అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారిని గుర్తిస్తుంది. ఇవి జిల్లాలో ఏడు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు

డాలర్‌ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం

For More AP News and Telugu News

Updated Date - Aug 10 , 2025 | 11:09 AM