Share News

Pawan Kalyan visits Rushikonda: రుషికొండను వ్యక్తిగత అవసరాల కోసం వాడారు.. జగన్‌పై పవన్ కల్యాణ్ ఫైర్

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:08 PM

రుషికొండ టూరిజం రిసార్ట్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం వాడుకున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ రిసార్టును మేజర్‌గా ఎలా వినియోగించాలో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Pawan Kalyan visits Rushikonda: రుషికొండను వ్యక్తిగత అవసరాల కోసం వాడారు.. జగన్‌పై పవన్ కల్యాణ్ ఫైర్
Pawan Kalyan visits Rushikonda

విశాఖపట్నం, ఆగస్టు29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నివాసం ఉండటానికే రుషికొండ ప్యాలెస్‌ను (Rushikonda Tourism Resort) కట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన ఆరోపణలు చేశారు. రుషికొండపై జగన్ మాఫియా దందాలు చేసిందని ఆరోపించారు. రుషికొండ టూరిజం రిసార్ట్‌ను తన స్వలాభం కోసం జగన్ వాడుకున్నారని విమర్శించారు పవన్ కల్యాణ్.


ఇవాళ(శుక్రవారం) రుషికొండ టూరిజం రిసార్ట్‌ను పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ టూరిజం రిసార్ట్స్‌లో రెండు బ్లాక్‌ల పేరిట రూ. 90 కోట్లు ఒకదానికి, రూ. 70 కోట్లు మరోదానికి ఖర్చు చేశారని వివరించారు. టూరిజం రిసార్ట్‌‌లోని 7 బ్లాక్‌లకుగానూ నాలుగింటిని మాత్రమే కట్టారని తెలిపారు. రూ. 454 కోట్లతో నాలుగు బ్లాక్‌లకు ఖర్చు చేశారని వెల్లడించారు పవన్ కల్యాణ్.


గతంలో తమను రుషికొండకు రానివ్వలేదని... ఎన్నో అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. గతంలో రిసార్ట్స్ నుంచి సంవత్సరానికి రూ.7 కోట్ల ఆదాయం టూరిజం శాఖకు వచ్చేదని వెల్లడించారు. ప్రస్తుతం కేవలం కరెంట్ బిల్లే సంవత్సరానికి రూ. 15 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు. రిసార్ట్‌‌లో మిగతా బ్లాక్‌ల గురించి ఇంకా మాట్లాడనవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.


రిసార్ట్‌ లోపల పెచ్చులు ఉడిపోతున్నాయని.. కొన్ని బ్లాక్‌లు లీకేజ్ అవుతున్నాయని తెలిపారు. జగన్ నివాసం ఉండటానికి మాత్రమే రుషికొండ రిసార్ట్‌ కట్టారని... కానీ కూటమి ప్రభుత్వంలో దీనిని టూరిజం కింద ఎలా అభివృద్ధి చేయాలన్నది ఆలోచిస్తున్నామని తెలిపారు. మేజర్‌గా ఈ నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచన చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ముందుగా రుషికొండ టూరిజం రిసార్ట్‌ను క్లీన్ చేయించాలని పవన్ కల్యాణ్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ క్రీడాకారులకు బంపరాఫర్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఆ అధికారిని విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై చింతా మోహన్ ఫైర్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 29 , 2025 | 12:26 PM