Chinta Mohan VS YSRCP: ఆ అధికారిని విమర్శిస్తారా.. భూమన కరుణాకర్ రెడ్డిపై చింతా మోహన్ ఫైర్
ABN , Publish Date - Aug 29 , 2025 | 10:37 AM
వైసీపీ నేతలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారిపై వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డి వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు.
గుంటూరు, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): వైసీపీ (YSRCP) నేతలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ (Chinta Mohan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారిపై వైసీపీ నేత భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఆ అధికారిని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు మహిళల విగ్గులు, చీరలు గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు చింతా మోహన్.
రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చెప్పిన చోటల్లా సంతకాలు చేసి సదరు అధికారిని జైలుకు వెళ్లిందని చింతా మోహన్ గుర్తుచేశారు. ఇవాళ (శుక్రవారం) గుంటూరులో చింతా మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ అక్రమాలకు ఆమెను వాడుకుని ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు ఏపీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, రుణమాఫీ చేయాలని సూచించారు చింతా మోహన్.
సినీ నిర్మాతలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న ప్రభుత్వం.. రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలను నాశనం చేయాలనేది ఎన్డీయే ఆలోచన అని ఆరోపించారు. అందుకే రాజ్యాంగ సవరణ ద్వారా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని శిక్షించేలా చట్టాలు తెస్తున్నారని ధ్వజమెత్తారు. బ్యాంకులు 90 శాతం రుణాలను కార్పొరేట్లకు, బడా బాబులకు మాత్రమే ఇస్తున్నాయని ఆరోపించారు. రూ.14 లక్షల కోట్ల రుణమాఫీలో ఎవరి వాటా ఎంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించాలని చింతా మోహన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ జగన్ చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదు..
ఏపీ ప్రభుత్వ స్టీల్‌ను దోచిన ఘనులు.. భారీ స్కాం వెలుగులోకి...
For More AndhraPradesh News And Telugu News