Housing Department Corruption: ఏపీ ప్రభుత్వ స్టీల్‌ను దోచిన ఘనులు.. భారీ స్కాం వెలుగులోకి...
ABN , Publish Date - Aug 29 , 2025 | 07:18 AM
పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ లక్ష్యం హౌసింగ్ శాఖలోని అవినీతి అధికారుల వల్ల నీరుకారుతోంది. హౌసింగ్ శాఖలో రోజుకు ఒక అవినీతి భాగోతం బట్టబయలు అవుతోంది. పేదల ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే సిమెంటు, స్టీలును హౌసింగ్ శాఖలోని వారే అడ్డంగా బొక్కుతున్నారు.
» హౌసింగ్‌లో ఇంటి దొంగలు
» స్టీలు అమ్మేసుకున్న ఘనులు
» విధుల నుంచి తొలగింపునకు ఆదేశాలు
ప్రొద్దుటూరు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ లక్ష్యం హౌసింగ్ శాఖలోని అవినీతి అధికారుల (Housing Department Corruption) వల్ల నీరుకారుతోంది. హౌసింగ్ శాఖలో రోజుకు ఒక అవినీతి భాగోతం బట్టబయలు అవుతోంది. పేదల ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే సిమెంటు, స్టీలును హౌసింగ్ శాఖలోని వారే అడ్డంగా బొక్కుతున్నారు. ఏకంగా టన్నుల కొద్ది స్టీలును, లోడ్లకు లోడ్లు సిమెంటును యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌లో విక్రయించి లక్షలకు లక్షలు సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని హౌసింగ్ గోడౌన్‌లోని స్టీలును అక్రమంగా బ్లాక్ మార్కెట్లకు తరలించిన ఇద్దరు ఏఈలు. ఇద్దరు వర్కు ఇన్‌స్పెక్టర్ల వ్యవహారం వెలుగుచూసింది.
విజిలెన్సు విచారణలో..
మైదుకూరు టౌన్ శాంతినగర్‌లో ఉన్న హౌసింగ్ సిమెంటు స్టీలు గోడౌన్‌ను ఈ ఏడాది మార్చి 11న విజిలెన్సు అధికారి డీఈఈ పి.చంద్రశేఖర్ రాజు తనిఖీ చేశారు. గోడౌన్ స్టాకుకు ఆన్‌లైన్ స్టాకుకు తేడాలు వెల్లడయ్యాయి. అలాగే మైదుకూరు రూరల్ హౌసింగ్ గోడౌన్‌ను సెతం ఇదే రోజు తనిఖీ చేశారు. ఇక్కడ కూడా ఆన్‌లైన్ స్టాకుకు గోడౌన్ స్టాకుకు తేడాలు అయ్యాయి. ఈ మేరకు ఆయన మార్చి 17వ తేదీన విజయవాడకు హౌసింగ్ సీఈ చీఫ్ విజిలెన్సు అధికారి నివేదిక అందజేశారు.
మైదుకూరు. టౌన్ శాంతినగర్ హౌసింగ్ గోడౌన్‌లో 6,858 మెట్రిక్ టన్నుల స్టీలును హౌసింగ్ మండల ఇన్‌చార్జ్ ప్రమోద్ కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రయ్య కలిసి బ్లాక్ మార్కెట్లకు తరలించారు. దాదాపు వాటి విలువ రూ.4,38,912 ఉంటుంది. అలాగే మైదుకూరు రూరల్ హౌసింగ్ గోడౌన్ నుంచి 5.833 మెట్రిక్ టన్నుల స్టీలును మండలహౌసింగ్ ఇన్‌చార్జ్ కె. నాగజ్యోతి, వర్క్ ఇన్‌స్పెక్టర్ సుహాసిని బ్లాక్ మార్కెట్లకు తరలించారు. వాటి విలువ సుమారు 5.3.73,313 ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు పై నలుగురినీ విధుల నుంచి తొలగించాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.శివప్రసాద్ కలెక్టర్‌కు ఉత్తర్వులు పంపారు. దోచుకున్న ప్రజాధనాన్ని వారి వద్దనుంచి రికవరీ చేయాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ జగన్ చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదు..
For More AndhraPradesh News And Telugu News