Share News

Minister Nara Lokesh: వైఎస్ జగన్ చ‌ట్టం ముందు దోషిగా నిల‌బడక త‌ప్పదు..

ABN , Publish Date - Aug 29 , 2025 | 06:47 AM

మంత్రి లోకేశ్‌ ఇవాళ(శుక్రవారం) ఉదయం 11 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌లో అర్థ సమృద్ధి ఐసీఏఐ నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు హాజరవుతారు. అక్కడ నుంచి 11.30 గంటలకు చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ఏఐ ల్యాబ్స్‌ను ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు.

Minister Nara Lokesh: వైఎస్ జగన్ చ‌ట్టం ముందు దోషిగా నిల‌బడక త‌ప్పదు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైన మీ కక్ష ఇంకా తీరలేదా జగన్ మోహన్ రెడ్డి అని ఐటీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా.. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని వీడియోను తెచ్చి అమరావతి అంటూ.. ఫేక్ ప్రచారం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అందరిదని, ఇక్కడ వివక్ష ఉండదని స్పష్టం చేశారు. ఇది బౌద్ధం పరిఢవిల్లిన నేల అని చెప్పుకొచ్చారు. కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీత‌మైన ఆత్మీయ బంధంతో ప్రజ‌లు క‌లిసి మెలిసి ఉంటారని వివరించారు. ప్రాంతాల మ‌ధ్య విద్వేషాలు, కులాల కుంప‌ట్లు, మ‌తాల మ‌ధ్య మంట‌లు రేపి చ‌లి కాచుకునే మీ కుతంత్రాల‌కు కాలం చెల్లిందని హెచ్చరించారు. కులాల క‌ల‌హాలు రేపే కుట్రలు అమ‌లుచేసిన మీ కిరాయి మూక‌ల ఆటను చ‌ట్టం క‌ట్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వెన‌కుండి న‌డిపిస్తున్న మీరు చ‌ట్టం ముందు దోషిగా నిల‌బడక త‌ప్పదని జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు.


మంత్రి లోకేశ్‌ ఇవాళ(శుక్రవారం) ఉదయం 11 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌లో అర్థ సమృద్ధి ఐసీఏఐ నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు హాజరవుతారు. అక్కడ నుంచి 11.30 గంటలకు చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ఏఐ ల్యాబ్స్‌ను ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు చంద్రంపాలెం పాఠశాల నుంచి బయలుదేరి రుషికొండలోని రాడిసిన్‌ బ్లూ హోటల్‌కు చేరుకుని ఏఐ ల్యాబ్స్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లి ఏరోస్పేస్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌పై సీఐఐ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు నుంచి 5.30 గంటల వరకు ఏయూ కన్వెన్షన్‌ హాలులో జరిగే జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు రాడిసిన్‌ బ్లూ హోటల్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని రాత్రికి బస చేస్తారు.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 06:54 AM