Prakash Raj: ఆర్ఎస్ఎస్‌పై నా పోరాటం ఆగదు.. ప్రకాశ్‌రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Dec 27 , 2025 | 07:50 PM
చమట చుక్కకు ఓటమి లేదని.. ప్రస్తుతం పేదల శ్రమకు అన్యాయం జరుగుతోందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం సీఐటీయూ గొంతెత్తి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయని విమర్శించారు.
విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీని పెంచి పోషిస్తున్న ఆర్ఎస్ఎస్‌తో మనం పోరాటం చేయాలని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ (Film Actor Prakash Raj) వ్యాఖ్యానించారు. మనం లేకపోయినా ఏదో ఒక రోజు కూకటి వేళ్లతో సైతం ఆర్ఎస్ఎస్‌ను పేకలించాలని హెచ్చరించారు. తాను సాంస్కృతికంగా ఆర్ఎస్ఎస్‌పై పోరాటం చేస్తానని పేర్కొన్నారు. భారతదేశంలో కనిపించని బ్రహ్మ రాక్షసుడు ఉన్నారని విమర్శించారు. కమలం పార్టీతో తాను పోరాడుతున్నానని.. తన పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఇవాళ(శనివారం) విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్‌లో శ్రామిక ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ప్రకాశ్‌రాజ్.
సీఐటీయూకి తనకు అనుబంధం చాలా ఏళ్ల నుంచి ఉందని గుర్తుచేసుకున్నారు. వీధి నాటకాల నుంచే తన ప్రయాణం ప్రారంభమైందని ప్రస్తావించారు. అబద్ధం మాట్లాడటానికి ధైర్యం ఉండాలని.. నిజం మాట్లాడటానికి కాదని చెప్పుకొచ్చారు. ఈరోజు రైతుల గుండెల మీద ఆయా ప్రభుత్వాలు బిజినెస్‌మెన్‌లను కూర్చొబెడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు అన్నదాతల కనీస సమస్యలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈరోజు ప్రజల గొంతుగా మారి తాను మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు ప్రకాశ్‌రాజ్.
మన ప్రభుత్వాలు అమ్ముడు పోయాయని ఆరోపణలు చేశారు. రాజకీయ నేతలు మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చమట చుక్కకు ఓటమి లేదని.. ప్రస్తుతం పేదల శ్రమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం సీఐటీయూ గొంతెత్తి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయని విమర్శించారు. విశాఖపట్నంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వాలు అమ్ముడు పోయాయని ప్రకాశ్‌రాజ్ విమర్శలు చేశారు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం
జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం
Read Latest AP News And Telugu News