Share News

Somireddy Criticize Jagan: జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరు.. సోమిరెడ్డి సెటైర్లు

ABN , Publish Date - Oct 07 , 2025 | 06:06 PM

దెయ్యాలు వేదాలు వల్లించడం.. జగన్ కల్తీ లిక్కర్ గురించి మాట్లాడటం నూటికి నూరుశాతం ఒక్కటేనని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. జగన్ తన అక్రమార్జన కోసం నాణ్యత లేని జే బ్రాండ్స్‌తో వేలమంది ప్రాణాలు తీసి లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

Somireddy Criticize Jagan: జగన్.. ఎన్ని జన్మలెత్తినా  పాపాలను కడుక్కోలేరు.. సోమిరెడ్డి సెటైర్లు
Somireddy Criticize Jagan

అమరావతి, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై తెలుగుదేశం ఎమ్మెల్యే, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్(X) వేదికగా ట్వీట్ చేశారు సోమిరెడ్డి. ‘ఏంది జగనన్నా..మీ నోటి వెంట నీతిసూక్తులా’ అని ఎద్దేవా చేశారు. దెయ్యాలు వేదాలు వల్లించడం.. జగన్ కల్తీ లిక్కర్ గురించి మాట్లాడటం నూటికి నూరుశాతం ఒక్కటేనని సెటైర్లు గుప్పించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.3500 కోట్ల స్కామ్‌తో ప్రజల ప్రాణాలతో ఆడుకుంది జగన్ ప్రభుత్వం కాదా అని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.


నాణ్యత లేని జే బ్రాండ్స్‌తో..

జగన్ తన అక్రమార్జన కోసం నాణ్యత లేని జే బ్రాండ్స్‌తో వేలమంది ప్రాణాలు తీసి.. లక్షల మంది ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. అనేక కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేసిన జగన్ రెడ్డీ.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తన లిక్కర్ పాలసీని సమర్థించుకుంటారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో జగన్‌లా ఇంత పచ్చి అబద్ధాలు ఆడే మరొక నాయకుడు ఉండరు... ఉండబోరని ఎద్దేవా చేశారు. క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్‌తో జే బ్రాండ్ మద్యమే తాగాలనే కండీషన్ పెట్టి, వేల మంది ప్రాణాలను తీశారని మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.


వేలకోట్ల నోట్లకట్టలతో డంపు..

జే బ్రాండ్ మద్యం తాగిన లక్షలాది మంది నరకయాతన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం తయారీ, సరఫరా, అమ్మకం ఇలా అన్ని విభాగాలను జగన్ తన చేతిలో పెట్టుకున్నారని ఆక్షేపించారు. వేలకోట్ల నోట్లకట్టలతో డంపు పెట్టుకున్న జగన్.. ఇప్పుడు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని విమర్శించారు. నకిలీ మద్యం సమాచారం అందగానే దాడులు చేసింది, అరెస్టులు చేసింది తమ ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు. మద్యం స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులని సస్పెండ్ చేసింది కూడా కూటమి ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. ఇదీ చట్టంపై, ప్రజల ఆరోగ్యంపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని నొక్కిచెప్పారు. మద్యం విధానంలో ఒక పారదర్శకత తేవడమే కాకుండా ప్రజలు కోరుకున్న మద్యం తాగే స్వేచ్ఛ, డిజిటల్ చెల్లింపులు ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నిత్యం నేరగాళ్లకు కొమ్ముకాస్తూ ఐదేళ్లు అరాచకాలకు పాల్పడిన జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు.


ఇవి కూడా చదవండి..

జగన్‌కు హెలికాఫ్టర్ ఓకే.. రోడ్ షోకు నో పర్మిషన్

ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 06:22 PM