Share News

Nara Lokesh: దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం

ABN , Publish Date - Mar 09 , 2025 | 02:39 PM

Nara Lokesh: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్త వరవడిని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సృష్టించారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

Nara Lokesh: దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం
Nara Lokesh

అమరావతి: నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) ఇవాళ(ఆదివారం) ఒక్క రోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు (105 Projects Launch) శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తులో చేపట్టడంపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అభినందనలు తెలిపారు. సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.


శ్రీధర్ రెడ్డి ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారని నారా లోకేష్ తెలిపారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.


రికార్డు దిశగా అడుగులు ఇలా..

కాగా.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్త వరవడిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సృష్టించారు. ఒక్క రోజులోనే 105 అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. దేశ చరిత్రలో కొత్త రికార్డు (New Record) సృష్టించే పనిలో ఎమ్మెల్యే కోటం రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి (Giridhar Reddy) ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో 105 అభివృద్ధి పనులకు కోటంరెడ్డి సోదరులు శంకుస్థాపనలు చేస్తున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క రోజులో 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Anil Video: బోరుగడ్డ అనిల్ వీడియోపై పోలీసుల సీరియస్

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

Minister Ram Prasad : క్రీడాభివృద్ధికి సహకరించండి

Read Latest AP News and Telugu News

Updated Date - Mar 09 , 2025 | 02:46 PM