Tragic incident in Kurnool District: మానవత్వం మరిచిన తండ్రి.. చిన్నారిని దారుణంగా..
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:27 PM
కర్నూల్ జిల్లాలోని దేవనకొండలో దారుణం ఘటన జరిగింది. ఎనిమిది నెలల చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు తండ్రి వీరేశ్. అనంతరం భార్య శ్రావణిని కొట్టి చంపేయడానికి భర్త వీరేశ్ ప్రయత్నించాడు.
కర్నూలు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని దేవనకొండలో (Devanakonda) దారుణం ఘటన జరిగింది. ఎనిమిది నెలల చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు తండ్రి వీరేశ్. అనంతరం భార్య శ్రావణిని కొట్టి చంపేయడానికి ప్రయత్నించాడు భర్త వీరేశ్. శ్రావణి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి (Kurnool Government Hospital) తరలించారు. ప్రస్తుతం శ్రావణికి వైద్యం అందిస్తున్నారు వైద్యులు.
కాగా, గతంలో మొదటి భార్యని చంపేసి జైలుకు వెళ్లివచ్చాడు వీరేశ్. అయితే, వీరేశ్‌పై కర్నూల్ జిల్లా పోలీసులకు (Kurnool District Police) శ్రావణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభతో జగన్‌కు దిమ్మతిరిగింది: మంత్రి గొట్టిపాటి
భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు
Read Latest Andhra Pradesh News and National News