Share News

AP Liquor Scam Key Update: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Aug 28 , 2025 | 08:50 PM

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-30 పైలా దిలీప్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పైలా దిలీప్‌కు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు షరతులు విధించింది.

AP Liquor Scam Key Update: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం
AP Liquor Scam Key Update

విజయవాడ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-30 పైలా దిలీప్‌(Dilip)కు విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) బెయిల్ మంజూరు చేసింది. పైలా దిలీప్‌కు బెయిల్ ఇస్తూ షరతులు విధించింది ఏసీబీ కోర్టు. 117 రోజులుగా దిలీప్ జైల్లో ఉన్నాడు. దిలీప్ కోర్టు అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లకూడదని ఆదేశించింది ఏసీబీ కోర్టు.


దిలీప్ పాస్‌పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతి వాయిదాకి తప్పకుండా హాజరుకావాలని చెప్పింది. ఈ కేసులో సాక్షులతో మాట్లాడకూడదని షరతు విధించింది. ఈ కేసులో సహ నిందితులతోనూ మాట్లాడకూడదని ఖండిషన్ పెట్టింది ఏసీబీ కోర్టు. లక్ష రూపాయలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని దిలీప్‌కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఏ-1 రాజ్ కసిరెడ్డి, ఏ-6 సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది ఏసీబీ కోర్టు.


నారాయణ స్వామి ఫోన్‌పై సిట్ ఫోకస్

మరోవైపు.. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫోన్‌పై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇటీవల నారాయణ స్వామిని విచారించిన సమయంలో ఆయన ఫోన్ స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. నారాయణ స్వామి ఫోన్‌లో డేటా పరిశీలనకు ఫోన్ FSLకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. FSLకి పంపటానికి అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుదాఘాతంతో యువకుడు మృతి.. పవన్ కల్యాణ్ విచారం

భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

For AP News And Telugu News

Updated Date - Aug 28 , 2025 | 09:14 PM