Home » Narayana Swamy
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత నారాయణ స్వామి మొబైల్‌ను FSLకి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-30 పైలా దిలీప్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పైలా దిలీప్‌కు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు షరతులు విధించింది.
మద్యం స్కామ్‌పై వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామి కీలక కామెంట్స్ చేశారు. మద్యం స్కామ్‌లో తాను ఏ తప్పు చేయలేదన్నారు. తప్పుడు కేసులు పెడితే వారి విజ్ఞతకే వదిలేస్తు్న్నానని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు ఉన్నది ఉన్నట్లు సమాధానం..
వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి కీలకంగా ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు. ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో నారాయణ స్వామి సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేసినట్లు తెలుస్తోంది.
Andhrapradesh: ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని... గెలిచినప్పుడు ఓడిపోయిన వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. 40 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఈరోజు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కొనసాగిస్తాను అన్న చంద్రబాబు నేడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆశ పెట్టి...పేదల కడుపు కొట్టారని విమర్శించారు.
Andhrapradesh: ‘‘మీడియాపై దాడి తప్పో, ఒప్పో నేను చెప్పలేను.. జర్నలిస్టులపై దాడిని నేను సమర్థించను. జర్నలిస్టుల దాడిపై తానేమి మాట్లాడిన సెన్సేషనల్ అవుతుంది’’ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ వైయస్ఆర్ కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిందని.. అలాంటి పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఉండడాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
నెల్లూరు జిల్లా గంగాధర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి నారాయణ స్వామి టికెట్ గల్లంతు అవుతుందని ప్రచారం జరుగుతుంది. నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకుంటే వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ఆయన అనుచరులు హెచ్చరించారు.
Andhrapradesh: డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఆయన వ్యతిరేక వర్గీయులు ధిక్కారస్వరం వినిపిస్తోంది. నారాయణ స్వామికి టికెట్ ఇస్తే తాము పని చేయమని వ్యతిరేక వర్గం తీర్మానించింది. పెనుమూరు మండలం పులుగుండు వద్ద వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు మండలాలకు సంబంధించిన నారాయణస్వామి వ్యతిరేకులు సోమవారం సమావేశమయ్యారు.
మద్యపానం నిషేధం అమలుపై డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఆవేశభరితమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వస్తే మద్యపానం నిషేధం చేస్తామని ప్రకటించమనాలంటూ.. రాబోయే ప్రభుత్వం చంద్రబాబుదే అంటూ ఉప ముఖ్యమంత్రి నర్మగర్భంగా ఒప్పుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇప్పటిది కాదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ.నారాయణ స్వామి అన్నారు.