AP Liquor Scam SIT investigation ON Narayana Swamy: మద్యం పాలసీపై సిట్ ప్రశ్నల వర్షం... కానీ నోరు మెదపని నారాయణ స్వామి
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:20 PM
వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి కీలకంగా ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు. ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో నారాయణ స్వామి సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేసినట్లు తెలుస్తోంది.
అమరావతి, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam) మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి (Narayana Swamy) కీలకంగా ఉండటంతో ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచి నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు. ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో నారాయణ స్వామి సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేసినట్లు తెలుస్తోంది. ‘నాకేం తెలీదు.. పైవాళ్లకే అంతా తెలుసు’ అంటూ సిట్ అధికారులకు సమాధానాలు ఇచ్చారు నారాయణ స్వామి. సిట్ వేసిన అనేక ప్రశ్నలకు తనకేం తెలీదనే మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి సమాధానాలిచ్చారు. మద్యం పాలసీలో మార్పులు, మద్యం ఆర్డర్స్‌లో ఆన్‌లైన్ విధానం తొలగింపు వంటి అంశాలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. మద్యం పాలసీలో మార్పుల గురించి తనకేమీ తెలీదని చెప్పారు నారాయణ స్వామి.
మద్యం ఆర్డర్లకు ఆన్‌లైన్ విధానం పక్కన పెట్టిన అంశంపైనా నారాయణ స్వామి నుంచి సమాధానం రాలేదు. డిజిటల్ చెల్లింపులు పక్కన పెట్టాలని ఎవరూ ఒత్తిడి తెచ్చారన్న ప్రశ్నలకూ తనకు సంబంధం లేదని పై వాళ్ల నిర్ణయమని చెప్పారు నారాయణ స్వామి. మద్యం పాలసీ రూపకల్పన మొదలుకుని.. అమ్మకాల వరకు తనకేం సంబంధం లేదని పై స్థాయి నిర్ణయాలని చెప్పారు.
రాజ్ కసిరెడ్డితో సహా ఇతరులు ఇచ్చిన సమాచారంతో సేకరించిన ఆధారాలను తన ముందు పెట్టి సిట్ అధికారులు నారాయణ స్వామిని ప్రశ్నించారు. అయితే ఆయన సరైన సమాధానాలు చెప్పక పోవడంతో మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా వ్యవహారించిన నారాయణ స్వామి నోరు విప్పితే అడ్జంగా బుక్ అయిపోతామనే ఆందోళనలో వైసీపీ హై కమాండ్ ఉంది. అంతా పైవాళ్లు అంటున్న నేపథ్యంలో తదుపరి సోదాలు, విచారణ, ఎక్కడ, ఎవర్ని విచారిస్తారు అనే అంశంలో రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం
Read Latest AP News And Telugu News