Share News

AP Liquor Scam: నేను ఏ తప్పూ చేయలేదు: నారాయణ స్వామి

ABN , Publish Date - Aug 23 , 2025 | 09:56 PM

మద్యం స్కామ్‌పై వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామి కీలక కామెంట్స్ చేశారు. మద్యం స్కామ్‌లో తాను ఏ తప్పు చేయలేదన్నారు. తప్పుడు కేసులు పెడితే వారి విజ్ఞతకే వదిలేస్తు్న్నానని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు ఉన్నది ఉన్నట్లు సమాధానం..

AP Liquor Scam: నేను ఏ తప్పూ చేయలేదు: నారాయణ స్వామి

తిరుపతి, ఆగస్టు 23: మద్యం స్కామ్‌పై వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామి కీలక కామెంట్స్ చేశారు. మద్యం స్కామ్‌లో తాను ఏ తప్పు చేయలేదన్నారు. తప్పుడు కేసులు పెడితే వారి విజ్ఞతకే వదిలేస్తు్న్నానని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నకు ఉన్నది ఉన్నట్లు సమాధానం చెప్పానన్నారు. తన వద్ద నుంచి ఎలాంటి ల్యాప్ ట్యాప్ గానీ, డబ్బులు, రికార్డ్స్ గాని వాళ్ళు తీసుకేళ్ళ లేదని తెలిపారు. తనకు వాట్సాప్ వాడటమే రాదన్నారు.


ప్రభుత్వమే మద్యం విక్రయిస్తే కమిషన్లు ఎలా వస్తాయని నారాయణ స్వామి ప్రశ్నించారు. జగన్ ఏ రోజూ తనకు ఇది చెయ్యి.. అది చెయ్యి అని చెప్పలేదన్నారు. అధికారులు స్టడీ చేసి వచ్చాక.. మంత్రివర్గంలో మద్యం పాలసీపై కలెక్టీవ్‌గా నిర్ణయం తీసుకున్నామని నారాయణ స్వామి తెలిపారు. సిట్ మళ్లీ పిలిస్తే వెళ్తానని అన్నారు. కట్టలు కట్టలుగా డబ్బులు తాను ఎప్పుడూ చూడలేదన్నారు. తన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడలేదన్నారు. మీడియాలో కథనాలు వచ్చినట్లు ఆ ఎనిమిది కోట్ల రూపాయలు తనకు ఇచ్చి.. తనను జైలుకు పంపినా పర్వాలేదన్నారు నారాయణ స్వామి. ఆ డబ్బును తన బిడ్డలకు ఇచ్చేస్తానని అన్నారు. చంద్రబాబుపై తనకేమీ శత్రుత్వం లేదన్న నారాయణ స్వామి.. పాలసీపైనే మాట్లాడుతున్నానని అన్నారు. తాను ఎలాంటి వాడినో చంద్రబాబు కూడా తెలుసునని చెప్పారు.


ఇదే సమయంలో నారాయణ స్వామి కుమార్తె కృపా లక్ష్మీ మాట్లాడుతూ.. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పామని.. నాకు తెలీదు, లేదు అని తన నాన్న చెప్పలేదన్నారు. తన తండ్రికి ల్యాప్ ట్యాప్ లేదని.. లేని ల్యాప్‌ ట్యాప్‌ని సీజ్ చేశారని ఎలా వార్త రాస్తారంటూ మీడియాను ఆమె ప్రశ్నించారు. పార్టీ ఇన్‌చార్జీగా తాను ఉన్నానని.. జగన్ ఆశీస్సులతో ఇన్‌చార్జీగా ఉంటానని ఆమె పేర్కొన్నారు.


అయితే, వైసీపీ పాలనలో బ్రాండెడ్ మద్యం లభ్యం కాని అంశంపై నారాయణ స్వామి సమాధానం దాటవేశారు. పేపర్ పైన రాసుకు వచ్చిన వాటిని చెప్పేసిన తరువాత.. చెప్పదలచుకున్నది చెప్పేశాము.. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమంటూ మీడియాతో నారాయణస్వామి కుమార్తె వాగ్వాదానికి దిగారు. నారాయణ స్వామి నివారించినా ఆయన కుమార్తె ఆగలేదు. ఇదే క్రమంలో నువ్వు ఏం రాసుకుంటావో రాసుకో అని ఓ పాత్రికేయుడితో నారాయణ స్వామి అన్నారు. కసిరెడ్డి ఎవరో తన ముగ్గురు బిడ్డల సాక్షిగా తనకు తెలియదన్నారు నారాయణ స్వామి. అయితే, ఇదే సమయంలో ఆయనపై వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియా పేర్లు చెప్పేయాలని నారాయణ స్వామిని సాక్షి టీవీ విలేకరి ఒత్తిడి చేశారు.


Also Read:

రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం

సరికొత్త వేదికలు..2027 వరల్డ్‌కప్ జోష్ షురూ.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 23 , 2025 | 09:56 PM