CM Revanth Reddy In PAC meeting : రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు: సీఎం
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:48 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని ఢిల్లీలో జరిగిన పీఏసీ సమావేశంలో..
హైదరాబాద్, ఆగస్టు 23 : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చామని.. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో బీసీలకు మేలు జరగాల్సిందేనని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబడాలన్న సీఎం రేవంత్.. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదన్నారు.
90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశంపైన సుప్రీం కోర్టులో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించామని సీఎం చెప్పారు. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న మన బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుందని చెప్పారు. విడిగా సుప్రీం కోర్టుకు వెళ్తే కేసు లిస్ట్ కావడానికి చాల సమయం పడుతుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరత పైన డ్రామాలు ఆడుతున్నాయని సీఎం విమర్శించారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటిఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థం అవుతుందని సీఎం ఎద్దేవా చేశారు. యూరియా కోసం నాలుగు సార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్ ను కలిశానని.. యూరియా పంపిణీ పైన క్షేత్రస్థాయిలో మానిటరింగ్ ను పెంచాలని సీఎం అన్నారు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి