ODI World Cup 2027: వన్డే ప్రపంచకప్ కొత్త వేదికలపై CSA క్లారిటీ..3 దేశాలు కలసి టోర్నీకి సిద్ధం
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:24 PM
ప్రపంచ క్రికెట్‌లో కొత్తగా 2027 వన్డే ప్రపంచకప్ సంయుక్త ఆతిథ్యంతో ముందుకొస్తోంది. ఎప్పడు లేని విధంగా ఈసారి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా 3 అఫ్రికన్ దేశాలు ఈ మెగా టోర్నీకి వేదికగా మారనున్నాయి. చరిత్రలో తొలిసారి, క్రికెట్ సంబురం ఈ దేశాల గడ్డమీద జరగనుంది.
ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా, 2027 వన్డే ప్రపంచకప్‌ను మూడు దక్షిణాఫ్రికన్ దేశాలు కలసి నిర్వహించబోతున్నాయి (ODI World Cup 2027 Host). దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఈ మూడు దేశాలు కలిసి క్రికెట్ అభిమానులకు టోర్నమెంట్ అందించేందుకు సన్నద్ధమవుతున్నాయి. మొత్తం 54 మ్యాచ్‌లు జరగబోతున్న ఈ టోర్నీలో, 44 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో, మిగతా 10 మ్యాచ్‌లు నమీబియా, జింబాబ్వేలలో జరుగుతాయి. మొదటిసారి ఈ మూడు దేశాలు కలసి వన్డే ప్రపంచకప్‌కు వేదికలవుతున్నాయి.
దక్షిణాఫ్రికాలో జరిగే నగరాలు ఇవే
ఈసారి దక్షిణాఫ్రికాలోని 8 నగరాలు మ్యాచ్‌లకు వేదికలుగా ఎంపికయ్యాయి. వాటిలో జోహనస్ బర్గ్, ప్రిటోరియా, కేప్‌టౌన్, డర్బన్, గెకెబెర్హా, బ్లోమ్ ఫొంటెయిన్, ఈస్ట్ లండన్, పార్ల్ ఉన్నాయి. ప్రతి నగరంలోనూ ప్రేక్షకులకు మంచి అనుభవం కలిగించేందుకు CSA (Cricket South Africa) ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది.
సౌత్ ఆఫ్రికాకు కొత్తేమీ కాదు
సౌత్ ఆఫ్రికా ఇంతకు ముందు కూడా గ్లోబల్ క్రికెట్ ఈవెంట్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా హోస్ట్ చేసింది. 2003లో ODI వరల్డ్ కప్, 2007లో T20 వరల్డ్ కప్, 2009లో చాంపియన్స్ ట్రోఫీ ఇక్కడ జరిగాయి. అంతే కాదు, మహిళల క్రికెట్‌లో కూడా సౌత్ ఆఫ్రికా మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది. 2005లో మహిళల ODI వరల్డ్ కప్, 2023లో మహిళల T20 వరల్డ్ కప్‌కి హోస్ట్ చేసింది. 2023లో ప్రోటియాస్ మహిళల టీమ్ ఫైనల్‌కు చేరినా, ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. ఇప్పుడు 2027లో మళ్లీ ఒక గ్రాండ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది.
CSA ఛైర్‌పర్సన్ ఏమన్నారు?
క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) ఛైర్‌పర్సన్ పెర్ల్ మఫోషే ఈ ఈవెంట్ గురించి సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. మేము ఒక గ్లోబల్, ఇన్‌స్పైరింగ్ ఈవెంట్ హోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ సందర్భంగా సౌత్ ఆఫ్రికా యూనిటీని ప్రపంచానికి చూపించే అవకాశం వచ్చిందని ఆమె అన్నారు. ఈ టోర్నమెంట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించేందుకు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ట్రెవర్ మాన్యువల్‌ను లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ హెడ్‌గా నియమించినట్లు తెలిపారు.
నమీబియా, జింబాబ్వే రోల్ ఏంటి?
సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే టీమ్స్ ఇప్పటికే 2027 వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయ్యాయి. కానీ నమీబియా మాత్రం ఆఫ్రికన్ క్వాలిఫయర్స్ ద్వారా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. నమీబియా, జింబాబ్వేలో కలిపి 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు దేశాలు కూడా ఈ గ్లోబల్ ఈవెంట్‌లో కీలక పాత్ర పోషించబోతున్నాయి.
టోర్నమెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
2027 ఓడీఐ వరల్డ్ కప్‌లో మొత్తం 14 టీమ్స్ పాల్గొంటాయి. ఇవి రెండు గ్రూపులుగా విభజించబడతాయి, ప్రతి గ్రూప్‌లో ఏడు టీమ్స్ ఉంటాయి. గ్రూప్ స్టేజ్‌లో ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని మిగిలిన టీమ్స్‌తో ఆడుతుంది. ఆ తర్వాత, ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 టీమ్స్ సూపర్ సిక్స్ రౌండ్‌కు వెళతాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లతో కొత్త వరల్డ్ ఛాంపియన్‌ను నిర్ణయిస్తారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి