Pemmasani On Postal And BSNL Services: సామాన్యులకు ఉపయోగపడేలా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పురోగతి: పెమ్మసాని
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:30 PM
భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి భారత్ నెట్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావలిసిన ఎకో సిస్టమ్స్ అభివృద్ధి చేయడానికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీ అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి భారత్ నెట్ (Bharat Net) సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావలిసిన ఎకో సిస్టమ్స్ అభివృద్ధి చేయడానికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకసారి ఎకో సిస్టమ్ ఏర్పాటు అయిన తర్వాత రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు పెమ్మసాని చంద్రశేఖర్.
ప్రస్తుతం గూగుల్ డాటా సెంటర్ (Google Data Center) ఏర్పాటైన తర్వాత చాలా సంస్థలు ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని వివరించారు. బెంగళూర్ లాంటి ప్రాంతాల్లో ఒక ఎకో సిస్టం ఏర్పాటైందని.. ఆ ప్రాంతంతో విశాఖపట్నానికి పోలిక అవసరం లేదని స్పష్టం చేశారు. పోస్టల్, బీఎస్ఎన్ఎల్, తదితర సంస్థలను కామన్ మ్యాన్‌కు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పెమ్మసాని చంద్రశేఖర్.
ఖర్చులు ఎక్కువగా ఉండి, ఆదాయం తక్కువగా ఉండే పోస్టల్ డిపార్ట్‌మెంట్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రూ.5 వేల కోట్ల నిధులతో పోస్టల్ సంస్థ నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే కాలంలో పోస్టల్ సంస్థను ఆదాయం అందించే సంస్థగా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటించారు పెమ్మసాని చంద్రశేఖర్.
బీఎస్ఎన్ఎల్ సేవలను మెరుగుపరచడానికి దాదాపుగా 20 వేల కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వినియోగదారుల భద్రత కోసం సంచార్ సాతి యాప్ సేవలను అందిస్తున్నామని తెలిపారు. టెలికాం వినియోగదారులను ఫైనాన్షియల్ ఫ్రాడ్‌ల నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బీసీ బిల్లు చంద్రబాబుతోనే సాధ్యం: బీసీ సంఘాలు
నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ.. నిజాలు బయటకు వచ్చేనా
Read Latest AP News And Telugu News