Share News

Satya Kumar PPP Medical Colleges: మెడికల్ కాలేజీలను పీపీపీతో చేస్తే తప్పేంటి?: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Oct 17 , 2025 | 01:29 PM

కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే అనేక పథకాలను అమలు చేస్తోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రజలకు ప్రతి చోటా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి.

Satya Kumar PPP Medical Colleges: మెడికల్ కాలేజీలను పీపీపీతో చేస్తే తప్పేంటి?: మంత్రి సత్యకుమార్
Satya Kumar PPP Medical Colleges

విజయవాడ, అక్టోబర్ 17: పీపీపీ మోడల్‌లో మెడికల్ కళాశాలల నిర్మాణం వల్ల నష్టం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakuma Yadav) మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అసత్య ప్రచారంతో రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు. 33 యేళ్ల తరువాత మళ్లీ ప్రభుత్వానికి ఆ కళాశాలు చెందుతాయని.. మెడికల్ కళాశాలలు పూర్తి అయితే 1500 సీట్లు వస్తాయని.. ఇందులో 725 సీట్లు పూర్తిగా ఉచితమని ప్రకటించారు. ఎన్టీఆర్‌ వైద్య సేవల కింద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామన్నారు. మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తెస్తే ప్రజలకు మంచి జరుగుతుందని వెల్లడించారు.


కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రజలకు ప్రతి చోటా మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో మాట్లాడుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 108, 104లను ప్రైవేటు వ్యక్తులతో నడిపారని గుర్తుచేసిన మంత్రి.. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పార్టనర్ షిప్‌తో చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. అసెంబ్లీ కి రా చర్చిద్దాం అంటే వచ్చే ధైర్యం లేదని విమర్శించారు. రిషికొండలో వందల కోట్లు తో భవనాలు నిర్మించారని.. మరి ఈ మెడికల్ కళాశాలలు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.


ప్రజలు చదువకుండా యువత మేదో సంపత్తిని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. నర్సీపట్నంలో మెడికల్ కళశాలను జగన్ నిర్మించలేదని.. ఐదు వందల కోట్లు అయితే జగన్ ఖర్చు పెట్టింది ఇరవై కోట్లు మాత్రమే అని తెలిపారు. మెడికల్ కళాశాలకు ఆయన ఇచ్చే నిర్వచనం ఏమిటో జగన్‌కే అర్ధం కాదంటూ దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే ఈ మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు.


ప్రజలను తక్కువ అంచనా చేసిన జగన్‌కు తగిన గుణపాఠం చెప్పారని.. అయినా ఇంకా పాత పద్ధతిలోనే జగన్ వెళుతున్నారని విమర్శించారు. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీం తెచ్చింది జగనే అని.. ఇప్పుడు ఆయనే విమర్శిస్తున్నారని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధులపై గురుతర బాధ్యతలు ఉన్నాయన్నారు. ఏ అంశం మాట్లాడినా ఆ విషయంపై పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఆగ్రహం, ఆనందం, ఆవేదన అయినా మీడియా సమావేశాల్లో, సభల్లో ముఖంలో కూడా కనిపించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

బీసీ బిల్లు చంద్రబాబుతోనే సాధ్యం: బీసీ సంఘాలు

నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ.. నిజాలు బయటకు వచ్చేనా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 17 , 2025 | 01:50 PM