Share News

Fake Liquor Case Chittoor: నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ.. నిజాలు బయటకు వచ్చేనా

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:49 PM

నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు ఏ 13 కట్టా సురేంద్ర నాయుడును పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మిగిలిన 9 మందిని వేరువేరుగా ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు.

Fake Liquor Case Chittoor: నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ.. నిజాలు బయటకు వచ్చేనా
Fake Liquor Case Chittoor

చిత్తూరు, అక్టోబర్ 17: మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో (Fake Liquor Case Chittoor) నిందితుల విచారణ మొదలైంది. మద్యం కేసులో పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి తంబళ్ల పల్లె కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతి మేరకు ఈరోజు (శుక్రవారం) ఉదయం మదనపల్లి సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం నిందితులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం మదనపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి నిందితులను తీసుకువచ్చారు. అనంతరం పది నిందితుల విచారణ ప్రారంభమైంది.


తమ కస్టడీకి తీసుకున్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు ఏ 13 కట్టా సురేంద్ర నాయుడును పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మిగిలిన 9 మందిని వేరువేరుగా ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. కట్ట సురేందర్ నాయుడును మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. మిగిలిన వారిని రెండు రోజుల పాటు విచారణకు తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కడప అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ జోగేంద్ర, సిట్ బృందం నుంచి మరో అధికారి విచారణ బృందంగా ఏర్పడి విచారణను కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో నిందితులు ఈ కేసుకు సంబంధించి ఏ యే విషయాలు బయటపెడతారో చూడాలి.


ఇవి కూడా చదవండి...

బీసీ బిల్లు చంద్రబాబుతోనే సాధ్యం: బీసీ సంఘాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 17 , 2025 | 01:08 PM