Share News

Vijay Kumar on GST Reforms: దేశ సంపద పెరగడానికి జీఎస్టీ సంస్కరణలు దోహదం

ABN , Publish Date - Sep 06 , 2025 | 01:45 PM

జీఎస్టీ సవరణలతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి, రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ప్రయోజనకరమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు. ఆటోమొబైల్స్ రంగంలో పది శాతం పన్ను తగ్గించడంతో కారు ధరలు రూ.లక్ష వరకు తగ్గే అవకాశం ఉందని విజయ్ కుమార్ వెల్లడించారు.

Vijay Kumar on GST Reforms: దేశ సంపద పెరగడానికి జీఎస్టీ సంస్కరణలు దోహదం
Vijay Kumar Comments on GST Reforms

అమరావతి, సెప్టెంబరు6 (ఆంధ్రజ్యోతి): దేశ సంపద మరింత పెరిగేందుకు కొత్త జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ (Nilayapalem Vijay Kumar) వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నూతన జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోందని పేర్కొన్నారు. ఇవాళ(శనివారం) అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయ్ కుమార్ మాట్లాడారు. గత 50 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పన్ను సంస్కరణలు ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదని చెప్పుకొచ్చారు.


నూతన జీఎస్టీ సంస్కరణలతో వ్యవసాయ, నిర్మాణ రంగం, ఇతర రంగాల అభివృద్ధికి దోహదపడతాయని నొక్కిచెప్పారు. కొత్త జీఎస్టీ పన్నుల విధానంతో ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతోందని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమకు ఐదు శాతం తగ్గింపు, పాల ఉత్పత్తులపై సున్నా పన్ను విధానంతో ఏపీకి ఆదాయం పెరుగుతోందని వివరించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై టారిఫ్‌లు విధించినా మనకు ఎక్కడా ఆర్థిక భారం పడకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నిత్యవసర వస్తువుల ధరలు తగ్గడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకగా వస్తువులు లభిస్తాయని తెలిపారు విజయ్ కుమార్.


జీఎస్టీ సవరణలతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి, రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ప్రయోజనకరమని వివరించారు. ఆటోమొబైల్స్ రంగంలో 10 శాతం పన్ను తగ్గించడంతో కారు ధరలు రూ.లక్ష వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీ ఆదాయం పెరిగితే గత ప్రభుత్వంలో మాదిరిగా దోపిడీ చేయకుండా, సంక్షేమానికి ఉపయోగించవచ్చని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా చంద్రబాబు సంస్కరణలు తీసుకొచ్చారని... సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబు అని నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు

వైసీపీకి షాకిచ్చిన కౌన్సిలర్లు.. ఏం జరిగిందంటే..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 06 , 2025 | 01:53 PM