Balakrishna in Vijayawada Utsav: అమరావతికి బ్రాండ్ సీఎం చంద్రబాబు: నందమూరి బాలకృష్ణ
ABN , Publish Date - Sep 27 , 2025 | 07:53 PM
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. 46 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. 11 రోజుల పాటు కనక దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరిస్తారని వివరించారు.
అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అమరావతి (Amaravati)కి బ్రాండ్ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అని నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు అనుభవంతో ఏపీ దేశ పటంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని నొక్కిచెప్పారు. ఏపీలో ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇవాళ(శనివారం) విజయవాడ ఉత్సవ్-2025 (Vijayawada Utsav 2025)లో భాగంగా గొల్లపూడిలో ఎగ్జిబిషన్‌ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. 46 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. 11 రోజుల పాటు కనక దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరిస్తారని వివరించారు. కళకు చావు లేదని.. కళలను నేటి తరానికి చాటి చెప్పాలని ఉద్ఘాటించారు. కూచిపూడి, తోలు బొమ్మలు కృష్ణా జిల్లాలో ప్రాచుర్యం పొందాయని వ్యాఖ్యానించారు. సినిమాలకు రాజధాని విజయవాడ అని నొక్కిచెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతోమంది తోడ్పడ్డారని తెలిపారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామని ఉద్ఘాటించారు. అమరావతిలో నిర్మించే హాస్పిటల్‌ను త్వరలోనే పూర్తి చేస్తామని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం:మంత్రి కందుల దుర్గేష్
గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News