Satyakumar ON YS Jagan: పీపీపీ విధానంపై చర్చకు రా.. జగన్‌కు మంత్రి సత్యకుమార్ స్ట్రాంగ్ సవాల్
ABN , Publish Date - Sep 20 , 2025 | 07:32 PM
పీపీపీ విధానంపై చర్చకు రావాలనే తన ప్రతిపాదనకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని అహర్నిశలూ అనేక వ్యయప్రయాసలకు పాటుపడుతున్న జగన్ ఇకనైనా చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పీపీపీ విధానంపై చర్చకు రావాలనే తన ప్రతిపాదనకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar) ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని అహర్నిశలూ అనేక వ్యయప్రయాసలకు పాటుపడుతున్న జగన్ ఇకనైనా చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. అందరినీ కొంతకాలం జగన్ మోసగించొచ్చు కానీ పూర్తి కాలం మోసగించలేరని మండిపడ్డారు. ఇవాళ(శనివారం) అమరావతి వేదికగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
పీపీపీ విధానంలో కొన్ని వైద్య కళాశాలల అభివృద్ధి, నిర్వహణపై తన వాదనకు వైసీపీలోనే మద్దతు లేదని జగన్ గ్రహించినందుకు అభినందనలు చెబుతున్నట్లు తెలిపారు. జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నిన్న (శుక్రవారం) చేపట్టిన నిరసన కార్యక్రమాల వైఫల్యం ద్వారా ఈ మేరకు ఆయనకు జ్ఞానోదయం కలగడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు. తన పార్టీ నాయకులు, కార్యకర్తలే జగన్ రెడ్డి వాదనను సమర్ధించకపోవడంతో నిరసన కార్యక్రమం నీరసించిపోయిందని విమర్శించారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
పులివెందులలోనూ జగన్ రెడ్డి ఆశించిన మేరకు మద్దతు లేకపోవడం ఆయన వాదనలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో వార్షిక ఫీజును రూ.12 లక్షలు, రూ.20 లక్షలుగా పెంచి రాజకీయ దురుద్దేశంతో నేడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇలాంటి చర్యలు జగన్ ద్వంద ప్రమాణాలకు అద్దం పడుతున్నారని ఆగ్రహించారు. జగన్ ఆలోచనలు ఏపీ ప్రజలు అర్థం చేసుకోవడంతో వారి నిరసన కార్యక్రమం ఫ్లాప్ అయ్యిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను: సీఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ
Read Latest AP News And Telugu News