Minister Narayana VS YSRCP: ఆ ద్రుష్పచారం నమ్మొద్దు.. జగన్ అండ్ కోకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Aug 24 , 2025 | 09:30 PM
అమరావతిపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. 2014, 2019లో రూ. 9 వేల కోట్లు రాజధానికి ఖర్చు పెడితే అదంతా నాశనం అయ్యిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమరావతిలో అనేక సమస్యల్ని పరిష్కరించిందని మంత్రి నారాయణ ఉద్ఘాటించారు.
పశ్చిమగోదావరి, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంపై కొంతమంది వైసీపీ నేతలు (YSRCP Leaders) చేసే ద్రుష్పచారం ఎవరూ నమ్మొద్దని ఏపీ మంత్రి నారాయణ (Minister Narayana) సూచించారు. అమరావతి రాజధాని చాలా సేఫ్ అని స్పష్టం చేశారు. గత ఐదు సంవత్సరాలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడారని.. ఎక్కడా రాజధాని కట్టలేదని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నారాయణ పాల్గొని మాట్లాడారు.
2014, 2019లో రూ. 9 వేల కోట్లు రాజధానికి ఖర్చు పెడితే అదంతా నాశనం అయ్యిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమరావతిలో అనేక సమస్యల్ని పరిష్కరించిందని ఉద్ఘాటించారు. అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, మూడు రిజర్వాయర్లు, 22,500 క్యూసెక్కుల వాటర్ పంప్ చేసే సిస్టం పనులను చాలా నాణ్యతగా చేపట్టామని వెల్లడించారు మంత్రి నారాయణ.
వీటిని నెదర్లాండ్స్ వారి వద్ద డిజైన్ చేయించామని వివరించారు. అమరావతిపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేపు మార్చి 31వ తేదీకి అధికారులకు 4000 అపార్ట్‌మెంట్‌లలో 250 అపార్ట్‌మెంట్లు తప్పా మిగతావి ఇచ్చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. 360 కిలోమీటర్ల ట్రంకు రోడ్డు పనులను సంవత్సరంన్నర లోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎరువులపై అలర్ట్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన బాలయ్య..మంత్రి నారా లోకేష్ అభినందనలు
For More AP News And Telugu News