Share News

Nara Lokesh Congratulates Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ సాధించిన బాలయ్య..మంత్రి నారా లోకేష్ అభినందనలు

ABN , Publish Date - Aug 24 , 2025 | 06:42 PM

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణకు స్థానం దక్కడంతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య మామయ్యకు అభినందనలు అని లోకేష్ పేర్కొన్నారు.

 Nara Lokesh Congratulates Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ సాధించిన బాలయ్య..మంత్రి నారా  లోకేష్ అభినందనలు
Nara Lokesh Congratulates Balakrishna

అమరావతి, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): పద్మభూషణ్, తెలుగుదేశం హిందూపూర్ ఎమ్యెల్యే, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (World Book of Records) చోటు దక్కించుకున్నారు. బాలకృష్ణ అందిస్తున్న సేవలకు గానూ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్యకు చోటు దక్కింది. ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్‌లో బాలకృష్ణ‌ను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ నిర్వాహకులు సత్కరించనున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలకృష్ణకు స్థానం దక్కడంతో పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.


బాలయ్య మావయ్య ఫ్యాషన్, అంకిత భావం మా అందరికీ సూర్ఫి: మంత్రి నారా లోకేష్

ఈ క్రమంలో సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అభినందనలు తెలిపారు. ‘తెలుగు సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య మామయ్యకు శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక సమయంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ గోల్డ్ ఎడిషన్‌లో మావయ్యకు చోటు దక్కడం మా కుటుంబానికి, తెలుగు సినీ అభిమానులకు గర్వకారణం. కళ పట్ల బాలయ్య మావయ్యకు ఉన్న ఫ్యాషన్, అంకిత భావం మా అందరికీ సూర్ఫి’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


బాలయ్య రికార్డు తెలుగు ప్రజలందరికీ గర్వకారణం: మంత్రి సవిత

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు సంపాదించిన నందమూరి బాలకృష్ణకు ఏపీ మంత్రి సవిత (Minister Savita) అభినందనలు తెలిపారు. బాలయ్య రికార్డు తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని ఉద్ఘాటించారు. 50 ఏళ్ల నట ప్రస్థానంతో తెలుగు సినీ కళామతల్లికి బాలయ్య చేసిన సేవలకు లభించిన గుర్తింపు ఇదని నొక్కిచెప్పారు. సినీ, రాజకీయ, సామాజిక సేవా రంగంలోనూ బాలయ్య సేవలు మరువలేనివని ప్రశంసించారు. తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య గుర్తింపు సాధించారని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎరువులపై అలర్ట్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

సురవరంతో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం: సీఎం చంద్రబాబు

For More AP News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 08:32 PM