Minister Narayana: వైసీపీ విష ప్రచారానికి ఆ 11 సీట్లు కూడా రావు.. మంత్రి నారాయణ వార్నింగ్
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:28 PM
వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజధాని అమరావతి మునిగిపోతుందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూడాలని.. కారణాలు తెలియకుండా మాట్లాడవద్దని మంత్రి నారాయణ హితవు పలికారు.
అమరావతి, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ (Minister Narayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై మీ ఏడుపులు ఇకనైనా ఆపాలని హితవు పలికారు. కొండవీటి వాగు ప్రవావాహానికి ఆటంకం వల్ల నీరు నిలిచిపోయిన నీరుకొండ పరిసర ప్రాంతాలను మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. పశ్చిమ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మట్టిని అడ్డు వేసి వదిలేయడంతో వాగు ప్రవాహానికి ఇబ్బందులు వచ్చాయని వివరించారు మంత్రి నారాయణ.
అడ్డుగా ఉన్న మట్టిని తొలగించడంతో పాటు వెస్ట్ బైపాస్ రోడ్డుకు రెండు చోట్ల గండ్లు కొట్టి నీరు వెళ్లేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ అండ్ కో విష ప్రచారాలు చేస్తే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన ఆ 11 సీట్లను కూడా ప్రజలు ఇవ్వరని చెప్పుకొచ్చారు. నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా...? అని ప్రశ్నించారు. గుంతల్లోకి నీరు వస్తే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా? అని నిలదీశారు. పశ్చిమ బైపాస్‌పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో నీరు నిలిచిపోయిందని తెలిపారు మంత్రి నారాయణ.
అది కూడా కేవలం రెండు గ్రామాల పరిధిలో మాత్రమే పొలాల్లో నీరు నిలిచిందని.. మిగతా గ్రామాల్లో వర్షం పడిన కొన్ని గంటల్లోనే నీరు బయటకు వెళ్లిపోయిందని వెల్లడించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టిని తొలగిస్తున్నామని అన్నారు. NH,ADC అధికారులు, ఇంజనీర్లు కలిసి కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టిని తొలగించే పనుల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు రాత్రికి మొత్తం నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాజధాని అమరావతి మునిగిపోతుందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూడాలని.. కారణాలు తెలియకుండా మాట్లాడవద్దని హితవు పలికారు. వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరని మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నందమూరి వారి ఇంట విషాదం.. హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
Read Latest AP News and National News