Share News

Nandamuri Padmaja: నందమూరి వారి ఇంట విషాదం.. హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:18 AM

నందమూరి ఇంట విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మరణించారు.

Nandamuri Padmaja: నందమూరి వారి ఇంట విషాదం.. హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

హైదరాబాద్, ఆగస్టు 19: నందమూరి వారి ఇంట విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మరణించారు. మంగళవారం ఉదయం ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ఫిలింనగర్‌లోని నివాసంలో ఆమె మృతి చెందినట్లు సమాచారం. రాజమండ్రి ఎంపీ, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పద్మజ స్వయాన సోదరి అవుతారు.

పద్మజ మరణ వార్త విని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. మరికాసేపట్లో.. సీఎం చంద్రబాబు నాయుడితోపాటు ఆయన కుటుంబం అమరావతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనుంది. అలాగే నందమూరి ఫ్యామిలీకి చెందిన వారంతా ఒకొక్కరుగా జయకృష్ణ నివాసానికి చేరుకొంటున్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:23 AM