Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు విష ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Aug 18 , 2025 | 06:06 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో హరిబాబు మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓట్లు రిగ్గింగ్ చేశారంటూ అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేసిన అంబటిపై చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లా, ఆగస్టు18 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుపై (Ambati Rambabu) గుంటూరు ఎస్పీకి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు (DCMS Chairman Haribabu) ఇవాళ(సోమవారం) ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో హరిబాబు మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓట్లు రిగ్గింగ్ చేశారంటూ అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేసిన అంబటిపై చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు హరిబాబు.
పశ్చిమ బెంగాల్‌లో 2023లో జరిగిన ఎన్నికల వీడియోను మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు. 2024లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మారకపోవడం దారుణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియోలు పెట్టి టీడీపీపై బురద జల్లారని మండిపడ్డారు. ఫేక్ వీడియోలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం వైసీపీకి పరిపాటిగా మారిపోయిందని ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారం చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అంబటి రాంబాబు జైలుకు వెళ్లడం ఖాయమని వడ్రాణం హరిబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
కేంద్రమంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..
Read Latest AP News And Telugu News