CM Chandrababu ON Health Secret: నా హెల్త్ సీక్రెట్ ఇదే.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Sep 23 , 2025 | 10:08 PM
అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాసేపు నవ్వులు పూయించారు. సీరియస్‌గా నడుస్తున్న సభలో తన వాక్చాతుర్యంతో సందడి చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) కాసేపు నవ్వులు పూయించారు. సీరియస్‌గా నడుస్తున్న సభలో తన వాక్చాతుర్యంతో సందడి చేశారు. ఆరోగ్యంపై శ్రద్ధం సందర్భంగా.. ఏం తినాలి.. ఎలా తినాలి.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై సరదాగా మాట్లాడుతూనే మంచి మంచి సలహాలు, సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.
ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తన వయసును పోలుస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి డైట్ పాటించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకంటే 6 నెలలు చిన్న వారైనా.. చాలా బాగా పని చేస్తున్నారని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. ఆయన అంతలా పని చేయడానికి కారణం మంచి ఆహారపు అలవాట్లేనని పేర్కొన్నారు. ఇంతవరకూ తాను, ప్రధాని సెలవు తీసుకోలేదని పేర్కొన్నారు చంద్రబాబు. మనం తినే ఆహారమే దివ్యౌషధమని.. వంట గదే ఫార్మసీ అని పేర్కొన్న ఆయన.. దీనిని ఫాలో అయితే ప్రజలందరి ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు.
మనుషులకు యావరేజ్ ఏజ్ 120 సంవత్సరాలు అని చెప్పారు సీఎం. అయితే, ప్రజలంతా 40 ఏళ్లలోనే 120 సంవత్సరాలు తినే ఫుడ్‌ని తినేస్తున్నారని అన్నారు. దీని కారణంగానే ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. ఇది మీకు కూడా వర్తిస్తుంది అధ్యక్షా అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి అనగానే సభ్యులందరూ చిరునవ్వులు చిందించారు. సెలబ్రిటీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడితే ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన వస్తుందన్నారాయన. అలాగే, నెలకు ఎంత ఆయిల్, ఎంత షుగర్ వాడాలో కూడా సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్
మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్
For More Andhra Pradesh News and Telugu News..