Share News

Satyakumar Challenges Jagan: మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్

ABN , Publish Date - Sep 23 , 2025 | 04:23 PM

అబద్దాలు చెప్పడమే అలావాటుగా మారిన పార్టీ వైసీపీ అంటూ సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించిన వారు మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని అంటున్నారని ఫైర్ అయ్యారు.

Satyakumar Challenges Jagan: మీ వాదనలో నిజం ఉంటే సభకు రా.. జగన్‌కు మంత్రి సవాల్
Satyakumar Challenges Jagan

అమరావతి, సెప్టెంబర్ 23: ఆరోగ్యంపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఏపీ వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ... తమకు వారసత్వంగా అనారోగ్య వ్యవస్ధ వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. నియామకాల నుంచి ట్రాన్సఫర్లల వరకూ ప్రతి చోట పోలిటికల్ ఇన్ఫ్యూఎన్స్ కూడా ఉండేదన్నారు. జాతీయ హెల్త్ మిషన్ కింద 40 కార్యక్రమాలకు రూ.100 కోట్లు కేంద్రం ఇన్సెంటివ్‌లు వచ్చాయని తెలిపారు. డాక్టర్‌ల అటెండెన్స్ 8 శాతం పెరిగిందని వెల్లడించారు. క్యాన్సర్‌కు ముందస్తు పరీక్షలు నిర్వహించి వ్యాధినిర్ధారణ నిర్వహిస్తున్నామని సభలో మంత్రి తెలియజేశారు.


మౌళిక సదుపాయాల కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ కర్నూలు, కడప, విశాఖలో, గుంటూరులో ఏర్పాటు చేశామన్నారు. 30 పాయింట్స్ యాక్సన్ ప్లాన్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఆడిట్ చేస్తున్నామన్నారు. యూనివర్సియల్ హెల్త్ కేర్ సెంటర్ ను తీసుకువస్తున్నామని చెప్పారు. బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా వైద్యం అందిస్తున్నామని అన్నారు. అబద్దాలు చెప్పడమే అలావాటుగా మారిన పార్టీ వైసీపీ అంటూ సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


దాన్ని వల్ల ప్రజలకు ఇబ్బంది లేదు..

గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించిన వారు మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని అంటున్నారని ఫైర్ అయ్యారు. నాలుగు సంవత్సరాల్లో రూ.8,420 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం రూ.1550 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. రూ.1550 కోట్లు నబార్డు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఫండ్స్ దీనిలో ఉన్నాయన్నారు. సంవత్సరానికి రూ.387 కోట్లు ఖర్చు చేశారని.. ఇదే విధంగా జరిగితే 18 సంవత్సరాలు పడుతుందని తెలిపారు. ఐదు కాలేజీల్లో తరగతులు కూడా జరుగుతున్నాయని జగన్ అంటున్నారని.. మీ వాదనలో నిజం ఉంటే సభకు రావాలని... వచ్చి చర్చలో పాల్గొనాలని సవాల్ చేశారు. పార్వతీపురం భూమిని సేకరించకుండానే మెడికల్ కాలేజీ కట్టేశాం అంటున్నారని అన్నారు. పీపీపీ మోడ్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. యాజమాన్య హక్కు తమ వద్దే ఉంటుందన్న వారు ఇచ్చేది కేవలం లీజు మాత్రమే అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.


మీరేమైనా పాలేగాళ్లా..

‘మేము వస్తే ఈ కళాశాలల నిర్మాణం రద్దు చేస్తా అని ఎలా అంటారు.. ఈ రాష్ట్రమేమైనా మీ జాగీరా మీరేమైనా పాలేగాళ్లా. చంద్రబాబు, వాజ్ పాయ్ గారితో కలిసి అధికారం లో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. గతంలో ఎన్డీయే హయాంలో నిత్యం ఢిల్లీ వెళ్ళి కాలేజీలు కావాలని అడిగేవారు. మీరు ఎప్పుడైనా కళాశాలలు కావాలని అడిగారా. చంద్రబాబు నాయుడు వాడారు కనుక ప్రజా వేదికను కూల్చారు. కానీ మేము మాత్రం పులివెందులలోని మెడికల్ కాలేజీని పూర్తిచేశాం’ అని వెల్లడించారు.


ముందు ఆ తేడా తెలుసుకోండి..

మెరుగైన నిర్వహణ కోసమే కొత్త వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. యూపీతో పాటు నాలుగైదు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు పీపీపీ విధానంలో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా తాము చూసుకోవాలన్నారు. జగన్ హయాంలో ఏడాదికి రూ. 300 కోట్లు మాత్రమే వైద్య కళాశాల కోసం ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. పులివెందుల వైద్య కళాశాలకు కూడా సరిగ్గా నిధులు కేటాయించి ఖర్చు చేయలేదని తెలిపారు. జాతీయ వైద్య మండలి పులివెందుల కాలేజీకి అనుమతి నిరాకరించిందన్నారు. పీపీపీ విధానంలో కాలేజీలు నిర్మించినా ప్రజలకు అందించే సేవల విషయంలో ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. పీపీపీ విధానంలో వాళ్లు కాలేజీ నిర్మించి 33 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారని తెలిపారు. ప్రైవేటీకరణకు పీపీపీకి తేడా తెలియకుండా వైసీపీ మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా ఓపీ, 70 శాతం పడకలు ఎన్టీఆర్ వైద్య సేవకు ఉచితంగా కేటాయించాలన్నారు.


ప్రభుత్వానిదే అజమాయిషి..

పీపీపీ విధానంలో నిర్మించిన కాలేజీలపై ప్రభుత్వమే అజమాయిషి చేస్తుందని వెల్లడించారు. జగన్ హయాంలో ప్రభుత్వ వైద్య కాలేజీల్లో పేమెంట్ సీట్లు పెట్టారని.. మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా పెట్టి ఎంబీబీఎస్ సీట్లు అమ్మాలని చూసింది జగన్ మాత్రమే అంటూ ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పీపీపీ విధానం వ్యతిరేంచటం సిగ్గుచేటని అన్నారు. దీనిపై చర్చించటానికి తాము సిద్ధంగా ఉన్నా... జగన్ అసెంబ్లీకి రావటం లేదన్నారు. పేదలకు వైద్య విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కల్లా నాలుగు వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో అందుబాటులోకి తెస్తామన్నారు. టెండర్ ప్రక్రియను పారదర్శకంగా చేస్తున్నామన్నారు మంత్రి. కావాలంటే వైసీపీ వాళ్లు వచ్చి టెండర్లు వేయవచ్చని తెలిపారు. వైసీపీ వాళ్లు వైద్య కళాశాలల వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నారని.. కేవలం కాలేజీ భవనాలు నిర్మించిన పులివెందులకు మాత్రం వెళ్లి ఫొటోలు దిగారన్నారు. భవనాలు లేని బాపట్ల, పార్వతీపురం వంటి ప్రాంతాలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.


నాలుగేళ్లు కాదు నలభై ఏళ్లైనా...

జగన్ మళ్లీ వచ్చి వైద్య కళాశాలల టెండర్లు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ బెదిరించటానికి ఇదేం పాలేగాళ్ల రాజ్యం కాదన్నారు. నాలుగేళ్లు కాదు నలభై ఏళ్ల తర్వాత కూడా జగన్ వచ్చేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో ఒక్క కాలేజ్ కూడా రాలేదని జగన్ అవినీతి పత్రికలో వార్తలు రాస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో 2004 ముందు 9 కాలేజీలు, 2014లో 6 కాలేజీలు వచ్చాయని తెలియజేశారు. జగన్ హయాంలో కేంద్రం నుంచి నిధులు వచ్చినా కాలేజీలు కట్టలేదన్నారు. 22 వేల 575 ఉచిత సీట్లు చంద్రబాబు హయాంలో వచ్చాయని గుర్తుచేశారు. గుంటూరు, కాకినాడ కాలేజీల్లో చదివిన వారు ఇప్పుడు తమ డబ్బులతో కాలేజీలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని... రాబోయే రెండేళ్లలో 9 కాలేజీలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వెనకబడిన ప్రాంతాల ప్రజలకు మంచి వైద్యం అందిస్తామని సభలో మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

దేవీ నవరాత్రులు.. డ్రెస్‌ కోడ్‌తో కూటమి మహిళా నేతలు

ఎస్సీ వర్గీకరణ బిల్లుపై సభలో చర్చ.. ఆమోదం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 04:49 PM