Parthasarathi Housing Statement: ప్రధాని ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీలో చర్చ
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:47 PM
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా బిల్లులను వైసీపీ ఆపివేసిందని మంత్రి పార్థసారథి అన్నారు. రూ.900 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని తెలిపారు. ఆవ భూముల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అమరావతి, సెప్టెంబర్ 23: ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. ఆవ భూముల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ ఏమైందో చెప్పాలని ఎమ్మెల్యే బత్తుల అన్నారు. సెంటు భూమి కోసం కేటాయించిన స్థలాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేయాలని మంత్రికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సూచించారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి పార్థసారథి (Minister Parthasarathi) సమాధానం ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు.
ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా బిల్లులు ఆపివేసిందన్నారు. రూ.900 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని తెలిపారు. ఆవ భూముల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి యూనిట్ ధర పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. వైసీపీ కేటాయించిన ఇళ్లను ఆపకుండా నిర్మాణం పూర్తికి తోడ్పాటు ఇస్తున్నామని సభలో తెలియజేశారు మంత్రి. జగనన్న కాలనీల ఇళ్ల కోసం భూముల సేకరణ విషయంలో అక్రమాలు జరిగాయని మంత్రి పార్థసారధి ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...
దానిపై వాయిదా తీర్మానం విడ్డూరం.. వైసీపీపై లోకేష్ మండిపాటు
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి వర్షాకాలం తర్వాతే..
Read Latest AP News And Telugu News