Share News

SC Classification Bill AP: ఎస్సీ వర్గీకరణ బిల్లుపై సభలో చర్చ.. ఆమోదం

ABN , Publish Date - Sep 23 , 2025 | 03:19 PM

కర్ణాటక నుంచి గ్రూప్ ఆఫ్ టీమ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేశారని ఎమ్మెల్యే వర్ల కుమార్ చెప్పారు. వర్గీకరణ దేశ వ్యాప్తంగా మొదటి సారి ఆంధ్ర ప్రదేశ్‌లో అమలు పరిచిన ఘనత చంద్రబాబు ది అని ఎమ్మెల్యే కొనియాడారు.

SC Classification Bill AP: ఎస్సీ వర్గీకరణ బిల్లుపై సభలో చర్చ.. ఆమోదం
SC Classification Bill AP

అమరావతి, సెప్టెంబర్ 23: ఏపీ అసెంబ్లీలో (AP Assembly) ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. మంగళవారం సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లున సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు ప్రవేశపెట్టగా దీనిపై ఎమ్మెల్యేలు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాబట్టే రాష్ట్ర మంతటా ఎస్సీలు ఆనందంగా ఉన్నారని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. కర్ణాటక నుంచి గ్రూప్ ఆఫ్ టీమ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేశారని చెప్పారు. వర్గీకరణ దేశ వ్యాప్తంగా మొదటి సారి ఆంధ్ర ప్రదేశ్‌లో అమలు పరిచిన ఘనత చంద్రబాబు ది అని ఎమ్మెల్యే కొనియాడారు.


మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ తరవాత డీఎస్సీలో ఎస్సీలోని అన్ని కులాలకు ఉద్యోగాలు రావటం సంతోకరమని హర్షం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ వర్గీకరణ అసంభవమని అన్నారని మడకశిర ఎమ్మెల్యే గుర్తు చేశారు.


ఆ ఘనత సీఎందే: పత్తిపాడు ఎమ్మెల్యే

36 లక్షల ఐసీఎల్ నిర్మించి మాన్యువల్ స్కావేంజర్ అన్న దానికి అర్థం లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు ది అని పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు కొనియాడారు. 12 కులాలు గ్రూప్ 1, 18 కులాలు గ్రూప్2, 26 కులాలు గ్రూప్ 3‌లో చేర్చి 200 పాయింట్‌లతో ఇంటర్నల్ రోస్టర్ సిస్టమ్ ఏర్పాటు చేసినా రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని అన్నారు. 17 వేల ఉద్యోగాల మొదటి సారిగా ఇంట్లర్నల్ రిజర్వేషన్ రోస్టర్ సిస్టాన్ని అమలు పరిచి దళితులలో ఓ విశ్వాసాన్ని నింపిన చరిత్ర నారా లోకేష్ ది అని చెప్పుకొచచ్చారు. చర్చ తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లును సభ ఆమోదం తెలిపింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టగా.. బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.


ఇవి కూడా చదవండి...

ప్రధాని ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీలో చర్చ

దేవీ నవరాత్రులు.. డ్రెస్‌ కోడ్‌తో కూటమి మహిళా నేతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 03:19 PM