Share News

AP Assembly Updates: అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:15 PM

రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ నడిచింది. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు అంశంపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ నడిచింది. ఈ సందర్భంగా..

AP Assembly Updates: అది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మంత్రి లోకేష్
Minister Nara Lokesh

అమరావతి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ నడిచింది. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు అంశంపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ నడిచింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష, అధికార నేతల మధ్య తీవ్ర చర్చ నడిచింది. విశాఖలో ఉర్సా కంపెనీకి ఎకరా భూమి 1 రూపాయికి ఇవ్వడమేంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్.. బొత్స వ్యాఖ్యలను ఖండించారు. ఉర్సా కంపెనీకి ఎకరా రూపాయికి ఇస్తానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి లోకేష్. జగన్ చెప్పిన మాటలనే బొత్స సత్యనారాయణ ఇక్కడ చెబుతున్నారని విమర్శించారు. రూపాయికి ఇస్తున్నట్లు తాను చెప్పినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం అని శాసనమండలి వేదికగా మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకు మాత్రమే ఎకరా రూపాయికి భూమిలిచ్చామని మంత్రి వివరించారు. ఉర్సా కంపెనీకి ఎకరా రూపాయికి ఇవ్వలేదని స్పష్టం చేశారు.


Also Read:

Snake Bite Video: పాములు పట్టడంలో చేసిన చిన్న తప్పు.. ఈ కానిస్టేబుల్ ప్రాణాలను ఎలా తీసిందో చూడండి..

National Film Awards: విజ్ఞాన్ భవన్‌లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 23 , 2025 | 05:16 PM