Share News

National Film Awards: విజ్ఞాన్ భవన్‌లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం..

ABN , Publish Date - Sep 23 , 2025 | 04:33 PM

దేశ రాజధాని ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. విజ్ఞాన్ భవన్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం..

National Film Awards: విజ్ఞాన్ భవన్‌లో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం..

National Film Awards: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. నటుడు మోహన్‌లాల్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు. అలాగే, షారూఖ్ ఖాన్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు రాణి ముఖర్జీ.


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి నిలిచింది. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ - హనుమాన్, బెస్ట్‌ యానిమేషన్ విజువల్స్, గేమింగ్ అండ్ కామిక్ - హనుమాన్, బెస్ట్ లిరిక్స్ - బలగం (ఊరు పల్లెటూరు పాట), బెస్ట్ స్క్రీన్ ప్లే - సాయి రాజేష్ నీలం(బేబీ), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ - రోహిత్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి(గాంధీ తాత చెట్టు), ఉత్తమ నటులుగా షారుఖ్‌ఖాన్‌(జవాన్‌), విక్రాంత్‌(12th ఫెయిల్), జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ, జాతీయ ఉత్తమ చిత్రం- 12th ఫెయిల్‌ నిలిచాయి. వీరందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నారు.


Also Read:

Dangerous Stairs Video: నరకానికి రహదారి అంటే ఇదేనేమో.. ఈ మెట్లు ఎక్కాలంటే గుండె ధైర్యం కావాల్సిందే..

Rain Alert in AP బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

For More National News and Telugu News..

Updated Date - Sep 23 , 2025 | 05:29 PM