Rain Alert in AP బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 23 , 2025 | 04:14 PM
బంగాళాఖాతంతో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
అమరావతి , సెప్టెంబరు23 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంతో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (Prakhar Jain) తెలిపారు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటుతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించారు.
🟠 రెడ్ అలర్ట్
విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
🟠 ఆరెంజ్ అలర్ట్
శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
🟡 ఎల్లో అలర్ట్
తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురుస్తాయని పేర్కొన్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్.
40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో చెట్ల కింద ప్రజలు నిలబడరాదని సూచించారు. వానలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏదో తేడా కొడుతుంది.? జగన్ కు బొత్స భయం
దేవీ నవరాత్రులు.. డ్రెస్ కోడ్‌తో కూటమి మహిళా నేతలు
For More AP News And Telugu News